Anushka Shetty : ప్రభాస్ పై ఆ ఫీలింగ్ ఎప్పటికీ పోదు – అనుష్క శెట్టి..!
Anushka Shetty : తెలుగు పరిశ్రమలో హీరోయిన్ అనుష్క శెట్టి పెళ్లి ఎవర్ గ్రీన్ టాపిక్. ఆమె పెళ్లిపై అనేక పుకార్లు వినిపించాయి. ముఖ్యంగా ప్రభాస్ , అనుష్క లు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం ఏళ్ల తరబడి నడుస్తుంది. సాహో సినిమా ప్రమోషన్స్ లో తన పెళ్లి పై ప్రశ్న వేధించింది. ప్రభాస్ ఎంతో సహనంగా సమాధానం చెప్పారు. మేము స్నేహితులం మాత్రమే, అంతకుమించి మా మధ్య ఎటువంటి రిలేషన్ లేదని క్లారిటీ […]
Anushka Shetty : తెలుగు పరిశ్రమలో హీరోయిన్ అనుష్క శెట్టి పెళ్లి ఎవర్ గ్రీన్ టాపిక్. ఆమె పెళ్లిపై అనేక పుకార్లు వినిపించాయి. ముఖ్యంగా ప్రభాస్ , అనుష్క లు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం ఏళ్ల తరబడి నడుస్తుంది. సాహో సినిమా ప్రమోషన్స్ లో తన పెళ్లి పై ప్రశ్న వేధించింది. ప్రభాస్ ఎంతో సహనంగా సమాధానం చెప్పారు. మేము స్నేహితులం మాత్రమే, అంతకుమించి మా మధ్య ఎటువంటి రిలేషన్ లేదని క్లారిటీ ఇచ్చారు. అనుష్క కూడా ఇదే తరహా సమాధానం చెప్పింది. అనంతరం దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి తో అనుష్క పెళ్లి అని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఆయన తన భార్యతో విడాకులు తీసుకున్నారు. రెండో వివాహంగా అనుష్కని చేసుకుంటారని వార్తలు తెరపైకి వచ్చాయి. అవి నిజం కాదని తేలిపోయాయి. ఆమెపై వచ్చిన కథనాలన్నీ పుకార్లు గానే మిగిలిపోయాయి. ఇప్పటికే ఆమె వయసు 40 దాటేసింది. దీంతో ఆమె అసలు వివాహం చేసుకుంటుందా లేదా అని సందేహాలు మొదలయ్యాయి. వీటికి అనుష్క స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఆమె లేటెస్ట్ మూవీ మిస్ సెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ లో భాగంగా ఆంగ్ల మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పెళ్లి ప్రస్తావన వచ్చింది. నేను పెళ్లికి వ్యతిరేకం కాదు. ఆ ఏ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది. సమయం వచ్చినప్పుడు తప్పకుండా చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది.
అనుష్క పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోతుందని చెందిన అభిమానులకు ఆమె కామెంట్స్ సంతోషపరిచాయి. ఇక అరుంధతి ,భాగమతిలో చేసిన పాత్రలు తనకు ఎంతో ఇష్టమని, అలాగే మిస్ చెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో చేసిన పాత్ర కూడా తనకు అంత ఇష్టమని వెల్లడించారు. అదృష్టం ఉంటే కానీ ఇలాంటి పాత్రలు చేసే అవకాశం వస్తుందని అన్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోగా నవీన్ పోలిశెట్టి నటించాడు. ఇక ఈ సినిమాపై అనుష్క భారీ అంచనాలు పెట్టుకుంది. మరి ఈ సినిమా ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.