Anushka Shetty : అనుష్క కి మెగా ఫ్యామిలీ అంటే నచ్చదా.. అందుకే మూడుసార్లు రిజెక్ట్ చేసిందా.. ??
ప్రధానాంశాలు:
Anushka Shetty : అనుష్క కి మెగా ఫ్యామిలీ అంటే నచ్చదా..
అందుకే మూడుసార్లు రిజెక్ట్ చేసిందా.. ??
Anushka Shetty : ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు రిపీట్ అవుతూ ఉంటాయి. హీరో హీరోయిన్లు, డైరెక్టర్ హీరో ఇలా కొన్ని హిట్ కాంబోలుగా ఉంటాయి. ఇక ప్రేక్షకులు కూడా ఈ కాంబోలో సినిమాలు చూడడానికి ఎదురు చూస్తుంటారు. ఇక అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. కానీ ఇప్పటిదాకా కుదరలేదు. ఇదిలా ఉండగా కొన్ని కాంబోలో ప్రభాస్ – అనుష్క, విజయ్ దేవరకొండ – రష్మిక వీరి కాంబోలో సినిమాలు రావాలని అనుకుంటారు. అలాగే రామ్ చరణ్ – అనుష్క కాంబినేషన్లో కూడా సినిమా రావాలని అనుకున్నారు కానీ అది ఇప్పటి వరకు రాలేదు.
అయితే అనుష్క రామ్ చరణ్ కాంబినేషన్లో మూడు సినిమాలు రావాల్సి ఉంది. కానీ అవి అనుష్క వల్లనే క్యాన్సిల్ అయ్యాయి. ముందుగా ‘ మగధీర ‘ సినిమాలో హీరోయిన్గా అనుష్క అని అనుకున్నారట. అయితే అనుష్క రిజెక్ట్ చేయడంతో జక్కన్న కాజల్ ను కలిశారట. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ మరో సినిమా ‘ రచ్చ ‘ సినిమాలో కూడా ముందుగా అనుష్కను అనుకున్నారట. కానీ సినిమా కథ నచ్చకపోవడంతో అనుష్క ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేశారట. ఇక చివరిగా ‘ గోవిందుడు అందరివాడేలే ‘ సినిమా కోసం ముందుగా స్వీటీ ని అనుకున్నారట. కానీ అనుష్క వేరే సినిమాతో బిజీగా ఉండడంతో ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేశారట.
ఇలా అనుష్క రామ్ చరణ్ మూడు సినిమాలను రిజెక్ట్ చేస్తూ వచ్చారు. దీంతో వీరి కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేకపోయింది. భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం లేనట్లుగా కనిపిస్తుంది. దీంతో అనుష్క మూడుసార్లు రాంచరణ్ సినిమాను రిజెక్ట్ చేయడంతో ఆమెకు మెగా ఫ్యామిలీ అంటే నచ్చదు అనుకుంటా అని కొందరు మెగా యాంటీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం ‘ గేమ్ ఛేంజర్ ‘ సినిమాలో నటిస్తున్నారు. అనుష్క ఇటీవల ‘ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ‘ సినిమాలో కనిపించారు. కానీ అనుష్క బాహుబలి తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. ఒక్కొక్క సినిమాకి చాలా గ్యాప్ తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు.