Ariyana : అరియానా పెళ్లి ఫిక్స్ అయిన‌ట్టేనా.. వ‌రుడు సిద్ద‌మ‌ట‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ariyana : అరియానా పెళ్లి ఫిక్స్ అయిన‌ట్టేనా.. వ‌రుడు సిద్ద‌మ‌ట‌..!

 Authored By sandeep | The Telugu News | Updated on :17 May 2022,4:30 pm

Ariyana : రామ్ గోపాల్ వ‌ర్మ ఇంట‌ర్వ్యూతో ఫుల్ ఫేమ‌స్ అయిన అందాల ముద్దుగుమ్మ అరియానా. వ‌ర్మ ఇంట‌ర్వ్యూతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అరియానా బిగ్ బాస్ ఆఫ‌ర్ కొట్టేసింది. ఆ షోలో టాప్ 5లో నిలిచి అంద‌రి మ‌న‌సులు గెలుచుకుంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ నాన్‌స్టాప్‌లో సంద‌డి చేస్తుంది. బిగ్ బాస్ షో తర్వాత అరియనా బుల్లితెర అవకాశాలు దక్కించుకున్నారు. పలు ఎంటర్టైన్మెంట్ షోలు, ఈవెంట్స్ తో సందడి చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అరియనా తన పెళ్లిపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను త్వరగానే పెళ్లి చేసుకుంటాను,

ఒకరి భార్యగా సంసారం, పిల్లలు లాంటి జీవితమంటేనే నాకు ఇష్టమని ఆమె తెలిపారు. ప్ర‌స్తుతం నాన్‌స్టాప్‌లో సంద‌డి చేస్తున్న అరియానాకి ఆస్ట్రాల‌జ‌ర్ ఆమె పెళ్లి ఎప్పుడో చెప్పింది.అరియానా జాతకాన్ని చూసిన ఆమె జాత‌కాన్ని బట్టి చూస్తే అరియానా నవంబర్‌లో పెళ్లి చేసుకోనుందని అర్థమవుతుందని ఆస్ట్రాలజర్ తెలిపింది. అంతే కాకుండా తన జాతకంలో కొత్త ఇల్లు కూడా రాసుందని చెప్పింది. అయితే ఆస్ట్రాలజర్ చేసిన ఈ వ్యాఖ్యలకు అరియానా అప్పుడు ఏమీ స్పందించలేదు. మరి తను చెప్పిన జాతకం నవంబర్‌లో నిజమవుతుందో లేదో చూడాలి. టాప్ 7 కంటెస్టెంట్లలో ఒకరైన అరియానా బిగ్ బాస్ ఓటీటీ తెలుగు విన్నర్ గా నిలవాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ariyana marriage news viral

ariyana marriage news viral

Ariyana : అరియానా జాత‌కం ఇదే..

బిగ్ బాస్ షో నిర్వాహకులు ప్రతి సీజన్ లో ఆస్ట్రాలజర్ ను పంపి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సెలబ్రిటీల జాతకాల గురించి వెల్లడిస్తారనే సంగతి తెలిసిందే.బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అరియానా కెరీర్ కు ప్రాధాన్యత ఇస్తారని ఆమె పెళ్లి చేసుకునే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అరియానా ఆ మ‌ధ్య ప‌లు సినిమాల‌లో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ కూడా పోషించింది. ఇక పెద్ద సినిమాల‌లో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తుంది. నాన్‌స్టాప్‌లో అరియానా ఈ సారి ఏ స్థానం నిల‌బెట్టుకుంటుంద‌ని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది