Bigg Boss OTT Telugu : కాఫీ పౌడర్ కోసం గొడవేసుకున్న అరియానా.. రచ్చ రచ్చ చేసింది
Bigg Boss OTT Telugu : ఏంటో ఈ బిగ్ బాస్. అసలు.. హౌస్ లో కంటెస్టెంట్లకు ఏవో ఏవో టాస్కులు ఇస్తుంటాడు. ఆ టాస్క్ లు సరిగ్గా చేయలేక.. కంటెస్టెంట్లు ఇబ్బందులు పడుతుంటారు. టాస్క్ లంటే ఎవరైనా ఫుడ్ మీద ఇస్తారా? కంటెస్టెంట్లు మిగితా కంటెస్టెంట్ల ఫుడ్ దాయడం దేనికి నిదర్శనం. అసలు.. బిగ్ బాస్ కు ఇవ్వడానికి టాస్కే దొరకడం లేదా? బిగ్ బాస్ కు ఏ టాస్క్ ఇవ్వాలో కూడా అర్థం కావడం లేదా?ఫుడ్ విషయంలో ఇవాళ బిగ్ బాస్ హౌస్ లో భలే విచిత్రం చోటు చేసుకుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఏదో టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ లో భాగంగా అరియానాకు ఇవ్వాల్సిన గుడ్లను దాచేస్తారు. దీంతో తనకు కోపం నశాలానికి అంటుతుంది.
ఆ తర్వాత కాఫీ పౌడర్ కూడా దాచేస్తారు. దీంతో తనకు చిరాకు వేస్తుంది. అంతా మీ ఇష్టం టాస్క్ లో భాగంగా అరియానా కాఫీ పౌడర్ ను కూడా దాచేయడంతో తనకు చిర్రెత్తుకొస్తుంది. రెండు రోజుల నుంచి నేను కాఫీ తాగకుండా ఉన్నాను. ఇక నావల్ల కాదు. కాఫీ పౌడర్ ఎక్కడ ఉంది చెప్పు అని సరయును అడుగుతుంది అరియానా.కాఫీ పౌడర్ కోసం అరియానా చేసిన రచ్చ మాత్రం మామూలుగా లేదు. ముందు కాఫీ పౌడర్ లేదన్న సరయు.. తర్వాత చైతూకు తెలుసు అంటుంది. చైతూను అడిగితే.. తనకు తెలియదు అంటాడు. దీంతో అరియానాకు చిర్రెత్తుకొస్తుంది. దీంతో అరియానా కోపంతో వాళ్లపై అరుస్తుంది.
ariyana serious on chaitu and sarayu over coffee powder
Bigg Boss OTT ariyana serious-on chaitu-and-sarayu-over coffee powdTelugu : కాఫీ పౌడర్ విషయంలో సరయుతో అరియానాకు గొడవ
దీంతో అప్పుడు సరయు వెళ్లి కాఫీ పౌడర్ ను తీసుకొచ్చి ఇస్తుంది. దీంతో సరయు, చైతూపై సీరియస్ అవుతుంది అరియానా. ఆ తర్వాత కాఫీ పౌడర్ తీసుకొని కాఫీ కలుపుకుంటుంది. కానీ.. సరయుపై మాత్రం వాగేస్తుంది. ఇంతకుముందు నా దగ్గర లేదన్నావు. ఇప్పుడు అడగ్గానే తీసుకొచ్చి ఇస్తావా.. ఎందుకు ఇలా అబద్ధాలు ఆడుతారు అంటూ సరయుపై సీరియస్ అవుతుంది.మధ్యలో ఇన్వాల్వ్ అయిన చైతూ.. వద్దు నువ్వు రెస్పాండ్ కాకు అంటూ సరయును అంటాడు చైతూ. ఏది ఏమైనా ఒక్క కాఫీ పౌడర్ కోసం అరియానా చేసిన రచ్చను చూసి కంటెస్టెంట్లు షాక్ అయ్యారు.