Artist Jayalalaitha : కార్లు లేక క్యాబ్‌లో తిరుగుతున్నాను.. నటి జయలలిత ఆవేదన
Artist Jayalalaitha : క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలిత గురించి తెలుగు ప్రేక్షకులను పరిచయం అక్కర్లేదు. వెండితెరపై వ్యాంప్ పాత్రలు వేసినా, బుల్లితెరపై పెద్ద మనిషి తరహాలో పాత్రలను రక్తి కట్టించినా కూడా అది జయలలితకే చెల్లింది. బుల్లితెరపై జయలలిత ఫుల్ డిమాండ్ ఉన్న నటి. అలాంటి జయలలిత ఓ సీరియల్ నిర్మాత చేతిలో దారుణంగా మోసపోయింది. ఉన్నదంతా పోగొట్టుకుని నడిరోడ్డు మీదకు వచ్చినంత పనైందట.

Artist Jayalalaitha in Ali show
బుల్లితెరపై మంచి పాత్రలు చేస్తూ బాగానే సంపాదించింది జయలలిత. అయితే ఓ నిర్మాత మాత్రం ఆమెను మోసం చేశాడట. జీఎస్టీ కట్టాలి.. సీరియల్ నిర్మించలేకపోతోన్నా అని చెబితే జయలలిత నమ్మేసిందట. తన దగ్గరున్న డబ్బులను వాడుకోమని జయలలిత చెప్పిందట. షేర్ లాంటివి ఏమీ వద్దని చెప్పి.. అలా ఇస్తూ తీసుకుంటూ చివరకు నాలుగు కోట్ల వరకు ముంచేశాడట.
Artist Jayalalaitha : కార్లు లేక క్యాబ్‌లో తిరుగుతున్నాను.. నటి జయలలిత ఆవేదన
2018 డిసెంబర్ నాటికి నాలుగు కోట్లు కాజేసి చేతులెత్తేశాడట. ఇప్పుడు క్యాబ్‌లో తిరుగుతున్నాను.. కార్లు లేవు.. ఒకప్పుడు ఎన్నో కార్లలో తిరిగేదాన్ని.. అలా ఎలా మోసపోయాను అని నా మీద నాకే అసహ్యం వేసేస్తోందంటూ జయలలిత ఎమోషనల్ అయింది. ఈ మేరకు అలీతో సరదాగా షోలో జయలలిత మీద కట్ చేసిన ప్రోమో అందరినీ టచ్ చేసింది. ఇక పూర్తి విషయాలు తెలియాలంటే వచ్చే వారం వరకు ఆగాల్సిందే.
