Star Heroine : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కొత్తేమీ కాదు. అది ఎప్పుడూ ఉండేదే. ఇప్పుడే కాదు.. 50 ఏళ్ల కింద కూడా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉండేది. ఇప్పుడూ ఉంది. అది కేవలం తెలుగు ఇండస్ట్రీకే పరిమితం అయింది కాదు.. ఏ ఇండస్ట్రీలో అయినా సరే అది కామన్. ఇప్పటి వరకు చాలామంది హీరోయిన్లు తాము కూడా కాస్టింగ్ కౌచ్ కు గురయినట్టు చెప్పుకొచ్చారు. తమ లైఫ్ లో కాస్టింగ్ కౌచ్ కు ఎలా గురయ్యారో.. తమను ఎవరు ఇబ్బంది పెట్టారో.. ఎవరు కమిట్ మెంట్ అడిగారో ఏదో ఒకప్పుడు బరస్ట్ అవుతూ ఉంటారు.

తాజాగా ఒకప్పటి హీరోయిన్ ఆశా షైనీ(ఫ్లోరా షైనీ) తాజాగా కాస్టింగ్ కౌచ్ పై సంచలన కామెంట్స్ చేసింది.తాజాగా ఇన్ స్టాలో ఓ వీడియో షేర్ చేసింది ఆశా షైనీ. ఓ నిర్మాతతో తను ప్రేమలో పడ్డానని.. అతడితో రిలేషన్ షిప్ లో ఉన్న సమయంలోనే అతడి గురించి అసలు విషయం తెలిసిందని చెప్పుకొచ్చింది ఆశా షైనీ. దాదాపు 14 నెలలు తను ఎవ్వరితో మాట్లాడనివ్వలేదని.. తనను టార్చర్ పెట్టాడని ముఖం మీద తీవ్రంగా కొట్టాడని, తన ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా తీవ్రంగా కొట్టాడని చెప్పుకొచ్చింది.

Star Heroine : ఫోన్ లాక్కొని వేధించేవాడు
తన ఫోన్ లాక్కొని వేధించే వాడని.. 14 నెలలు నరకం అనుభవించానని చెప్పుకొచ్చింది ఆశా షైనీ. తను తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. నువ్వు నాకు నచ్చావ్, నరసింహనాయుడు లాంటి పెద్ద పెద్ద సినిమాల్లో నటించిన ఆశా షైనీ.. తెలుగుతో పాటు తమిళం, కన్నడ సినిమాల్లోనూ నటించింది. ఏ సినిమా చేసినా అందులో సెకండ్ హీరోయిన్ గా చేసేది ఆశా షైనీ. ఆ సమయంలోనే తనకు కన్నడకు చెందిన ఓ పెద్ద ప్రొడ్యూసర్ తో పరిచయం ఏర్పడింది. అతడితో రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడే తనకు ఈ బాధలు ఎదురయ్యాయి.