Samantha : సమంత న్యూ లుక్.. వెంకీ మామ కూతురి కామెంట్ వైరల్
Samantha : సమంత ఇప్పుడు మంచి ఫాంలో ఉంది. పర్సనల్ లైఫ్‌ను సమంత అంతగా పట్టించుకోవడం లేదు. నాగ చైతన్యతో విడాకుల సంగతిని మొత్తంగా పక్కన పెట్టేసినట్టు కనిపిస్తోంది. సినిమా ఇండస్ట్రీలోని తన ఫ్రెండ్స్‌తో చిల్ అవుతోంది. నందినీ రెడ్డి, ఉపాసన ఇలా అందరితో కలిసి సమంత ఎంజాయ్ చేస్తోంది. ఇక దీపావళి పండుగలో భాగంగా నందినీ రెడ్డి, శిల్పా రెడ్డి, ఉపాసనలతో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది.

Ashritha Daggubati On Samantha Beautiful Pics
తాజాగా సమంత కొత్త లుక్కులో కనిపించింది. వెరైటీ దుస్తుల్లో కొత్త కొత్త యాంగిల్స్‌తో సమంత పోజులు ఇచ్చింది. ఈ మేరకు సమంత షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే సమంత షేర్ చేసిన ఈ ఫోటోలపై సెలెబ్రిటీల స్పందిస్తున్నారు. సమంత పోస్ట్ చేస్తే కచ్చితంగా వెంకటేష్ కూతురు స్పందిస్తుంది. ఆశ్రిత దగ్గుబాటి ఎక్కువగా సమంత పోస్టులకు రియాక్ట్ అవుతుంటుంది. ఈ సారి సానియా మీర్జా కూడా స్పందించింది.
Samantha : సమంతపై ఆశ్రిత కామెంట్స్

Ashritha Daggubati On Samantha Beautiful Pics
స్టన్నింగ్ అంటూ సానియ మీర్జా సమంత అందాన్ని పొగిడేసింది. ఇక ఎంతో అందంగా ఉన్నావ్ అన్నట్టుగా బ్యూటీఫుల్ అని ఆశ్రిత కామెంట్ చేసింది. మెరుపులా మెరుస్తున్నావ్ అన్నట్టుగా స్పార్కల్ ఎమోజీని షేర్ చేసింది. సానియా, ఆశ్రితలకు సమంత ధన్యవాదాలు తెలిపింది. అయితే సమంతఈ ఫోటోలను తన స్టోరీలోషేర్ చేసింది. అందులో.. ఆశావాహులు ఎక్కువగా ఉంటారు.. కానీ ఇంకా ఎక్కువ ఉండాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది.