Ashu Reddy : సముద్రతీరంలో కౌగిలిలో బంధీగా.. అషూకు తోడు దొరికినట్టుంది!
Ashu Reddy : అషూ రెడ్డి ఎప్పుడూ కూడా ప్రేమ కథలతోనే ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు రాహుల్ సిప్లిగంజ్, ఇప్పుడు ఎక్స్ ప్రెస్ హరి ఇలా ప్రేమ కథలు, ట్రాక్‌లను నడుపుతూ అషూ తెగ హల్చల్ చేస్తుంటుంది. అయితే రాహుల్ తన స్నేహితుడు అని, హరి కూడా మంచి స్నేహితుడేనని అషూ చెబుతుంటుంది. ఇక వివాదాలతోనూ అషూ రెడ్డి బాగానే ఫేమస్ అవుతోంది. రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూలో అషూ చేసిన మాటలు, ఇచ్చిన రియాక్షన్లు నెట్టింట్లో ట్రోలింగ్‌కు గురయ్యాయి.
అంతకుముందు పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఫోటోలు, అతని టాటూలు ఒంటిపై ఉండటం ఇలాంటి విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అయితే అషూ రెడ్డి ఇప్పుడు తెరపై ఎక్కువ సందడి చేస్తోంది. స్పెషల్ ఆల్బమ్స్‌లో కూడా నటిస్తోంది. గత నెలలో రాహుల్ సిప్లిగంజ్‌తో కలిసి అషూ రెడ్డి ఓ సాంగ్ చేసింది. దానికి ఆర్జీవీ కూడా స్పెషల్ ప్రమోషన్స్ కల్పించాడు. తాజాగా అషూ రెడ్డి మరో ఆల్బమ్‌కు సిద్దమైనట్టు కనిపిస్తోంది.
Ashu Reddy : ప్రైవేట్ ఆల్బంలో అషూ రెడ్డి రచ్చ
అయితే ఆ ఆల్బం ప్రమోషన్స్‌ను ఇప్పటి నుంచే మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. తోడు దొరికేసిందన్నట్టుగా చెప్పేసింది. రెండు విభిన్న ప్రదేశాల నుంచి వచ్చిన మనుషులు.. రెండు జీవితాల ప్రయాణం.. రెండు హృదయాలు.. చివరకు ఒక్కటిగా కలిశాయ్.. అంటూ కౌగిలో బంధీ అయిన ఫోటోను అషూ రెడ్డి షేర్ చేసింది. అయితే ఇది సాంగ్ షూటింగ్ కోసమని అందరికీ అర్థమవుతోంది. మొత్తానికి అషూ రెడ్డి మాత్రం ప్రైవేట్ ఆల్బమ్స్, షోలతో బిజీగా ఉంటోంది.