Ashu Reddy: అషూ రెడ్డి లవ్ ట్రాక్..కమెడియన్‌కి కొత్త గిఫ్టులతో సర్‌ప్రైజ్ ఇచ్చింది..మరి అతని సంగతేంటి

Authored By vamana sai | The Telugu News | Published on: September 24, 2021, 8:50 am

Ashu Reddy: అషూరెడ్డి..ఇప్పుడు ఎక్కడ చూసినా ఈమె పేరే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందుకు కారణం సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇటీవల ఆయన – అషు రెడ్డిల బోల్డ్ ఇంటర్వ్యూ బాగా వైరల్ అయింది. అంతకముందే అషూరెడ్డికి జూనియర్‌ సమంత అని పేరుంది. ఇక ఆమె బిగ్‌బాస్‌ సీజన్‌లో పాల్గొన్న తర్వాత నుంచి విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ పెరిగింది. ఇక గతకొన్ని రోజులుగా ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ వస్తుంది. రాహుల్‌ సిప్లిగంజ్‌తో లవ్‌ట్రాక్‌, ఆ తర్వాత ఆర్జీవీతో బోల్డ్‌ ఇంటర్వ్యూతో అషూ మరో రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకుంది.

ashu-reddy-love track...surprised comedian with new gifts

ashu-reddy-love track…surprised comedian with new gifts

కాగా గత కొంత కాలంలో ఓ షోలో కమెడియన్‌ ఎక్స్‌ప్రెస్‌ హరికి, అషూకి మధ్య ఏదో ఉందని వార్తలు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతకముందు హరి, తన గుండెలపై అషూ పేరుతో పచ్చబొట్టు పొడిపించుకొని అందరికి షాక్‌ ఇచ్చాడు. అయితే తాజాగా అషూ కూడా హరిపై తనకున్న ప్రేమను బయటపెట్టింది. హరి కోసం ఖరీధైన స్పోర్ట్స్ బైక్ గిఫ్ట్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ప్రపోజ్‌ చేసి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది. దాంతో హరి ఇప్పటివరకు తన తల్లిదండ్రులు కూడా ఇంత కాస్ట్‌లీ గిఫ్ట్‌ కొనివ్వలేదని అందరిముందూ బాగా ఎమోషనల్‌ అయ్యాడు.

Ashu Reddy: అషూ మా చిచ్చా(రాహుల్‌)ని వదిలేస్తున్నావా ..?

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇక అషూ కూడా ఈ వీడియోను షేర్‌ చేస్తూ, ‘హరి నీకు ఈ బైక్‌ ఎంత ముఖ్యమో నాకు తెలుసు. లైఫ్‌లో నువ్వు ఎక్కడ ఎలా ఉన్నా నా ఆలోచనలకు ఎప్పుడూ దగ్గరగా ఉంటావు’.. అంటూ తన ఇన్‌స్టా పోస్ట్‌లో కామెంట్ జతచేసింది. ఇది చూసిన నెటిజన్లు.. అషూ మా చిచ్చా(రాహుల్‌)ని వదిలేస్తున్నావా అంటూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇది ఓ టీవీ షోలో భాగంగా జరిగిన సంఘటన.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp