Ashu Reddy : నా దేవుడిని రెండో సారి కలిశాను.. అషూ రెడ్డి ఎమోషనల్
Ashu Reddy : డబ్ స్మాష్ ఫేమ్ అషూ రెడ్డి.. బిగ్ బాస్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయింది. అయితే బిగ్ బాస్ బ్యూటీగా కంటే పవన్ కళ్యాణ్ వీరాభిమానిగానే అందరికీ సుపరిచితురాలు. ఆమె ఒంటిపై ఉన్న పవన్ కళ్యాణ్ టాటూలూ ఆమెను మరింతగా ఫేమస్ చేశాయి. అంతే కాకుండా ప్రైవేట్ పార్ట్స్ దగ్గర వేసుకున్న టాటూ అయితే మరింతగా వైరల్ అయింది. అయితే అషూ రెడ్డి గతంలో ఓ సారి పవన్ కళ్యాణ్‌ను కలిసిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాలో హిమజ నటిస్తోన్న విషయంతెలిసిందే. ఈ క్రమంలో హిమజతో పవన్ కళ్యాణ్ ఫోటోలు దిగడమే కాకుండా ఓ చిన్న లేఖను కూడా గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇక ఇవి చూసిన అషూ ఆగలేకపోయినట్టుంది. మళ్లీ ఎలాగైనా పవన్ కళ్యాణ్‌ను కలవాలని ఫిక్స్ అయింది. అందుకే తాజాగా పవన్ కళ్యాణ్‌ను కలిసింది. ఈ మేరకు ఆమె గాల్లో తేలిపోతూ ఓ పోస్ట్ చేసింది. నా దేవుడిని మళ్లీ కలిశానంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.
Ashu Reddy : అషూ రెడ్డి ఎమోషనల్
పవన్ కళ్యాణ్‌ను మళ్లీ కలవడంపై అషూ రెడ్డి స్పందిస్తూ.. నా దేవుడిని మళ్లీ కలిశాను.. మొదటి సారి కలిసినప్పుడు నా టాటూను చూపించిన సందర్భం కూడా గుర్తుందని ఆయన అన్నారు. టీ తాగమని ఆఫర్ చేశారు.. రెండు గంటల సేపు ముచ్చట్లు పెట్టుకున్నాం. ఎంతో హాయిగా అనిపించింది. ఎంతో సంతోషంగా ఉంది.. వెళ్లే ముందు ఓ లెటర్‌ను కూడా ఇచ్చాడు. నా ఫస్ట్ లవ్ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆ లెటర్‌లోఅశ్విని (అషూ) గారికి.. మీరు కోరుకున్నవన్నీ మీ జీవితంలో జరగాలని కోరుకుంటూ.. పవన్ కళ్యాణ్ అని రాసుకొచ్చాడు.