ఈ ‘ఐ లవ్యూ’ అర్థమేంటి పాప.. రాజ్ తరుణ్ అవికా గోర్ రచ్చ

Authored By Admin | The Telugu News | Published on: December 26, 2020, 5:44 pm

సినీ ఇండస్ట్రీలో కొన్ని స్నేహాలు మొదట్లోనే అంతమవుతుంటాయి. మరి కొన్ని స్నేహాలు.. చివరి వరకు ఉంటాయి. ఇంకొన్ని స్నేహాలు ప్రేమ, పెళ్లి వరకు వెళ్తుంటాయి. అయితే రాజ్ తరుణ్, అవికా గోర్‌ల స్నేహబంధం మాత్రం ఇంకా అలానే కొనసాగుతోంది. ఉయ్యాల జంపాల సినిమాతో మొదలైన ఈ ఇద్దరి ప్రయాణం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. మధ్యలో ఈ ఇద్దరి మీద రకరకాల వార్తలు వచ్చాయి.

Avika Gor Says I love u To Raj Tarun In His House warming event

Avika Gor Says I love u To Raj Tarun In His House warming event

కానీ రాజ్ తరుణ్ తాను ప్రేమలో ఉన్నానని క్లారిటీ ఇవ్వడం, అవికా గోర్ తన ప్రేమికుడిని పరిచయం చేయడంతో ఈ ఇద్దరిది స్నేహబంధమే అని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా రాజ తరుణ్ తన సొంతింటి కలను సాకారం చేసుకున్నాడు. రాజ్ తరుణ్ గృహ ప్రవేశం చేయడంతో ఓ ఇంటి వాడయ్యాడు. రాజ్ తరుణ్‌కు ఇప్పుడు సినిమాలేవీ లేకపోయినా.. ఒక్క హిట్ రాకపోయినా కూడా కొత్త ఇంటిని కొనడంతో అందరూ ఆశ్చర్యపోతోన్నారు.

దానికంటే ముఖ్యంగా ఆ ఈవెంట్‌లో అవికా గోర్ ఉండటమే కాకుండా అవికాపై రాజ్ తరుణ్ చేసిన కామెంట్స్, దానికి అవికా ఇచ్చిన రిప్లై అన్ని కూడా వైరల్ అవుతున్నాయి. నా మొదటి సినిమా నుంచి నా కొత్తింటి గృహ ప్రవేశం వరకు నాతో ఉన్నావ్ అంటూ అవికా గురించి రాజ్ తరుణ్ చెప్పుకొచ్చాడు. దీనికి అవికా స్పందిస్తూ.. అమీ తుమాకీ బాలు బాషీ (బెంగాల్‌లో ఐ లవ్యూ) అని చెప్పేసింది. హ్యాపీ టియర్స్ అంటూ మరో కామెంట్ పెట్టేసింది. అయితే ఇందులో అవికా చెప్పిన ఐ లవ్యూకి అర్థం ఏంటో మాత్రం ఎవ్వరికీ తెలియడం లేదు.

Admin

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp