Avinash : కొత్త షోలో కొత్త జంట.. భార్యతో కలిసి అవినాష్ హల్చల్
Avinash : జబర్దస్త్, బిగ్ బాస్, కామెడీ స్టార్స్ వంటి షోలతో అవినాష్ బాగానే సంపాదించేశాడు. జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ షోకు వెళ్లేందుకు అవినాష్ ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. మల్లెమాల అగ్రిమెంట్ కోసం పది లక్షలు కట్టాడు. బిగ్ బాస్ షోకు వెళ్లాడు. యాభై లక్షలు సంపాదించాడు. మొత్తానికి అవినాష్ మాత్రం ఇప్పుడు కామెడీ స్టార్స్ అంటూ నిలబడ్డాడు.
ఇక పెళ్లి తరువాత అవినాష్ మరింత జోరు పెంచాడు. తన భార్య అనూజతో కలిసి యూట్యూబ్ వీడియోలంటూ నానా హంగామా చేస్తున్నాడు. భార్యతో కలిసి రకరకాల ట్రావెలింగ్, షాపింగ్, ఇంట్లోని వీడియోలు పెడుతూ బాగానే సంపాదిస్తున్నాడు. అయితే అవినాష్ తన భార్య అనూజని కూడా స్క్రీన్‌కు పరిచయం చేయాలని బాగానే తహతహలాడుతున్నాడు.

avinash and anuja in ismart jodi season 2
Avinash : ఇస్మార్ట్ జోడిలో అవినాష్..
అందుకే స్టార్, జీ తెలుగు ఈవెంట్లలో ఆమెను తీసుకొస్తున్నాడు. ఇకతాజాగా ప్రారంభం కాబోతోన్న ఇస్మార్ట్ జోడి సీజన్ 2లో అవినాష్ తన భార్యతో కలిసి రాబోతోన్నాడు. ఈ షోకు సంబంధించిన ప్రోమోలు వైరల్ అవుతున్నాయి. అందులో అవినాష్, అనూజ జోడి కూడా పాల్గొనబోతోంది.అంటే ఇంకో రెండు మూడు నెలలు మళ్లీ అవినాష్ తన భార్యతో కలిసి బుల్లితెరపై ఇలా కనిపించబోతోన్నాడన్న మాట.
Newly married #Avinash and #Anuja couple for #IshmartJodi2 ❤️
Starting today at 6 PM on #StarMaa pic.twitter.com/MGrZCySA9L
— starmaa (@StarMaa) December 26, 2021