Avinash : అవినాష్ భార్య కూడా మొదలెట్టేసింది!.. అంతా ట్రైనింగ్ మహిమ
Avinash : అవినాష్ బుల్లితెరపై చేసే అతి గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ఇంట్లో చేసే ఓవర్ యాక్షన్‌కు అవినాష్ కాస్త అతినాష్ అయ్యాడు. తనది తాను ఎంటర్టైన్ అని ప్రకటించుకున్నాడు. అలా స్వయం ప్రకటిత కమెడియన్ అయిపోయాడు. జబర్దస్త్ షోలో అంటే అవినాష్ కామెడీ వర్కవుట్ అయింది. కానీ అదే కామెడీని కామెడీ స్టార్స్ షోలో చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు.ఆ షోలో అవినాష్ తన ఫ్యామిలీని దించాడు.
తన తమ్ముడు అజయ్‌ని తీసుకొచ్చాడు. అన్నాదమ్ముల్లిద్దరూ కలిసి స్కిట్లు వేసేవారు. ఇక తన భార్యను స్పెషల్ ఈవెంట్లకు తీసుకొచ్చేశాడు. ఇక ఇప్పుడు ఏకంగా ఇస్మార్ట్ జోడి సీజన్ 2లో జంటగా పాల్గొంటున్నారు. మొత్తానికి తన భార్యను మాత్రం పాపులర్ చేయాలని అవినాష్ బాగానే ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.అందుకే అటు బుల్లితెరపై, ఇటు సోషల్ మీడియాలోనూ తన భార్య అనూజను బాగానే ప్రోత్సహిస్తున్నాడు.

Avinash And His Wife Anuja Reel Video
Avinash : భార్యతో అవినాష్ రీల్స్
యూట్యూబ్ వీడియోలు, ఇన్ స్టా రీల్ వీడియోలతో అవినాష్ దుమ్ములేపుతున్నాడు. తాజాగా తన భార్యతో కలిసి అవినాష్ ఓ రీల్ వీడియో చేశాడు. అందులో అనూజే బాగా చేసింది. ఆమె ముందు అవినాష్ వెలవెలబోయాడు. ఆ వీడియోను చూసి సిరి తెగ నవ్వేసుకుంది. ఎంతో క్యూట్‌గా ఉందని కామెంట్ పెట్టేసింది.