Baby Movie : మూడు రోజుల్లో బేబి సినిమా ఎంత కలెక్ట్ చేసిందో చూస్తే పెద్ద పెద్ద హీరోలు దండం పెట్టేస్తారు !

Advertisement

Baby Movie : రీసెంట్ గా విడుదలైన ‘ బేబీ ‘ సినిమా టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. చిన్న సినిమా అయినప్పటికీ కూడా యూత్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలకు ముందు పాటలు మరియు టీజర్ ప్రేక్షకులను మెప్పించాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. విడుదల తర్వాత కూడా ‘ బేబీ ‘ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుంది. యువతకు కనెక్ట్ అయ్యేటట్టు ఒక సినిమా తీస్తే ఎలాంటి వసూళ్లు వస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసారి బేబీ సినిమా నిరూపించింది. ఇక ఈ సినిమాలో నటించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లకు మంచి గుర్తింపు వచ్చింది.

Advertisement

మరీ ముఖ్యంగా యూట్యూబర్ గా ‘ సాఫ్ట్ వేర్ డెవలపర్ ‘ సినిమాతో సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ఇప్పుడు ఈ సినిమాతో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమా విడుదలై నేటికీ మూడు రోజులు అవుతుంది. వసూళ్ల పరంగా అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతుంది. మొదటిరోజు ప్రీమియర్ షోలో 2 తెలుగు రాష్ట్రాలలో కలిపి ఈ సినిమాకి రెండు కోట్ల 62 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇక రెండవ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. రెండవ రోజు ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాలలో రెండు కోట్ల 98 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. మూడవరోజు కూడా అద్భుతమైన ట్రెండ్ ని చూపించింది.

Advertisement

Baby Movie Review - Heartbreaking emotional entertainer - JSWTV.TV

మూడవరోజు దాదాపుగా ఈ సినిమాకి మూడు కోట్ల 20 లక్షలు రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. అలా మూడు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాలలో ఎనిమిది కోట్ల 88 లక్షల రూపాయలు వసూళ్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కలిపి 11 కోట్ల 20 లక్షల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. మూడు రోజులకే బేబీ సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తే మరి కొద్ది రోజులలో ఇంకెన్ని వసూళ్లను సాధిస్తుందో చూడాలి. ఇకపోతే విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. అంతకుముందు చేసిన రెండు సినిమాలు అంతగా సక్సెస్ కాకపోయినా ‘ బేబీ ‘ సినిమా మాత్రం అతడికి మంచి లైఫ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

Advertisement
Advertisement