Bala Krishna : క‌మెడీయ‌న్ కాళ్లు ఎత్త‌మ‌న్న బాల‌య్య‌.. దండం పెడ‌తాన‌ని కామెంట్స్ చేశాడేంటి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bala Krishna : క‌మెడీయ‌న్ కాళ్లు ఎత్త‌మ‌న్న బాల‌య్య‌.. దండం పెడ‌తాన‌ని కామెంట్స్ చేశాడేంటి?

 Authored By sandeep | The Telugu News | Updated on :10 September 2022,7:00 pm

Bala Krishna : నంద‌మూరి బాల‌య్య ఆరు ప‌దుల వ‌య‌స్సులోకి చేరుకున్నా ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నాడు. అలానే ఆహాలో అన్‌స్టాప్ బుల్ షోతో హోస్ట్‌గా త‌న సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. బాల‌య్య ఒక్కోసారి చిన్న పిల్లాడిలా మారి సంద‌డి చేస్తుంటాడు. త‌న తోటి నటీనటుల‌తో క‌లిసి ఫ‌న్ కూడా చేస్తుంటాడు. బాల‌య్య‌కు సంబంధించిన ఏ వీడియో అయిన బ‌య‌ట‌కు వ‌చ్చిన అది కొద్ది క్ష‌ణాల‌లోనే వైర‌ల్ అవుతుంటుంది. ప్ర‌స్తుతం బాల‌య్య NBK 107 మూవీ షూటింగ్‌లో భాగంగా టర్కీలో ఉన్నవిషయం తెలిసిందే. షూటింగ్‌లో ప్ర‌ముఖ క‌మెడియ‌న్ స‌ప్తగిరి బాల‌య్య‌ను ఆయ‌న ముందే ఇమిటేట్ చేసేందుకు ట్రై చేశాడు. బాల‌య్య స్టైల్లో ఓ పెద్ద డైలాగ్‌ను ఆయ‌న్ను అనుక‌రిస్తూనే చెప్పాడు.

Bala Krishna : భ‌ళా బాల‌య్య‌..

balakrishna funny video with saptagiri

balakrishna funny video with saptagiri

ఇద్దరు ఒకేసారి డైలాగ్ చెబుతుండగా.. మధ్యలో బాలయ్య ఆపేశారు. సప్తగిరి కంటిన్యూ చేసి బాలయ్యను మెప్పించాడు. దీంతో వెంటనే బాలయ్య ఫన్నీగా సప్తగిరి కాళ్లు పట్టుకునేందుకు ప్రయత్నించారు. సప్తగిరి నవ్వుకుంటూ బాలయ్య కాళ్ల మీద పడ్డాడు. ‘ఓసారి.. నీ కాళ్లు పైకి ఎత్తరా.. దండం పెడతా..’ అంటూ బాలకృష్ణ అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఫ‌న్నీ వీడియో ప్ర‌తి ఒక్క‌రికి తెగ న‌చ్చేసింది.

అఖండ లాంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత బాల‌కృష్ణ‌ ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో 107వ సినిమా చేస్తున్నాడు. అటు మ‌లినేని గోపీచంద్ ర‌వితేజ‌తో క్రాక్ లాంటి మాసీవ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టి ఇప్పుడు ఏకంగా బాల‌య్య‌నే డైరెక్ట్ చేసే ల‌క్కీ ఛాన్స్ కొట్టేశాడు. మ‌లినేని గోపీకి ఇది పెద్ద హీరో సినిమా కావ‌డంతో చాలా ప్లానింగ్‌తో పాటు ఎలాగైనా హిట్ కొట్టి స్టార్ డైరెక్ట‌ర్ల లీగ్‌లో చేరాల‌ని క‌సితో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్టుగా ప్ర‌చారం అయితే జ‌రుగుతోంది. శృతీహాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కూడా మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తోంది. క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ఫారిన్‌లో జ‌రుగుతోంది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది