Balakrishna : విడుదలకు ముందే చిరంజీవి రికార్డులు ఎడం కాలితో తన్ని అవతల చేసిన బాలయ్య …!

Advertisement

Balakrishna : సంక్రాంతికి సినిమాల సంద‌డి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పెద్ద సినిమాలు ఆ స‌మ‌యంలో విడుద‌ల కానుండ‌డంతో ప్రేక్ష‌కులు సంక్రాంతిపై తెగ దృష్టి పెడుతుంటారు. ఈ సారి సంక్రాంతికి పెద్ద సినిమాలు వ‌స్తుండ‌గా, అందులో చిరంజీవి, బాల‌కృష్ణ‌, విజ‌య్ సినిమాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలయికలో బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇదే సంస్థ నుంచి వస్తోన్న మరో చిత్రం ‘వీరసింహా రెడ్డి’ కాగా, ఇందులో నందమూరి బాలకృష్ణ హీరోగా న‌టిస్తున్నారు.

Advertisement

ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద పోటీ పడుతుండ‌డం విశేషం. చాలా కాలం తరవాత సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య నిలవడంతో అందరి దృష్టి ఈ సినిమాలపై ప‌డింద‌నే చెప్పాలి. బాక్సాఫీసు వద్ద ఈ బడా హీరోల ఫైట్ ఎలా ఉండబోతోందో చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజ‌య్ వార‌సుడు 12న‌, బాల‌య్య వీర‌సింహారెడ్డి కూడా 12న వ‌స్తుండ‌గా, చిరంజీవి వాల్తేరు వీర‌య్య సినిమాను జ‌న‌వ‌రి 13న లాక్ చేశారు. అయితే చిరంజీవి సినిమా డేట్ 13న లాక్ చేయ‌డంపై మెగాభిమానులు కోపంతో ఉన్నారు. ఎందుకంటే వీర‌య్య తొలి రోజు రికార్డులు సెట్ చేయ‌డం దాదాపు అసాధ్యం.

Advertisement
Balakrishna creates records
Balakrishna creates records

Balakrishna : బాల‌య్య ల‌క్కీ ఛాన్స్

అందుకు కార‌ణం అజిత్ తెగింపు సినిమా 11న తెలుగు, త‌మిళ్‌లో వ‌స్తుండ‌గా, ఈ సినిమాను కూడా దిల్ రాజు రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ క్ర‌మంలో 11న తెగింపుకు సోలో రిలీజ్‌తో ఎక్కువ థియేట‌ర్లు దొరుకుతాయి. 12న విజ‌య్ వార‌సుడు, బాల‌య్య వీర‌సింహారెడ్డి ఉన్నాయి. రెండు సినిమాలు థియేట‌ర్ల‌ను చెరి స‌గం పంచుకుంటాయి. దీంతో ఎలా లేద‌న్నా తొలి రోజు వాల్తేరు వీర‌య్యకు 30 – 35 శాతం థియేట‌ర్లు మించి దొరికే ప‌రిస్థితి లేదు. అంటే మూడు సినిమాల త‌ర్వాత నాలుగో సినిమాగా వీర‌య్య వ‌స్తున్న నేప‌థ్యంలో ఈ సినిమాకి త‌క్కువ థియేట‌ర్స్ దొరుకుతాయ‌ని, పెద్ద‌గా రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ లేద‌ని అంటున్నారు. బాల‌య్య మాత్రం అద‌ర‌గొట్ట‌డం ఖాయం అంటున్నారు.

Advertisement
Advertisement