RRR Movie : అయ్యో… ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అఖండ కంటే చెడిపోయిందా పాపం!

Advertisement

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తాజా చిత్రం ఆర్ఆర్‌ఆర్‌ ఎన్నో భారీ రికార్డులను సొంతం చేసుకుంది. ఆల్‌ ఇండియా రికార్డులను మాత్రమే కాకుండా ఓవర్సీస్ రికార్డులను కూడా సొంతం చేసుకున్న ఆర్ ఆర్‌ ఆర్‌ ఒక్క విషయంలో అఖండ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేక పోయింది అంటూ నందమూరి బాలయ్య అభిమానులు గర్వంగా చెబుతున్నారు. మా బాలయ్యకే సాధ్యం అయిన 100 రోజుల రికార్డు అనేది ఆర్‌ ఆర్‌ ఆర్‌ టీమ్‌ కు సాధ్యం కాలేదు అంటూ గల్లా ఎగరవేసి మరీ బాలయ్య అభిమానులు గర్వంగా సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.

Advertisement

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తాజాగా వంద రోజులు పూర్తి చేసుకుంది. వంద రోజుల తర్వాత కూడా ఇంకా ఎక్కడైనా థియేటర్లలో ఉందా అంటూ వాకబు చేయగా ఏ ఒక్క చోట కూడా ఈ సినిమా లేదని క్లారిటీ వచ్చింది. కనీసం ఒక్క థియేటర్ లో కూడా దేశ వ్యాప్తంగా కనిపించడం లేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా రాబట్టాల్సిన మొత్తంను మొదటి రెండు మూడు వారాల్లోనే రాబట్టింది. ఆ తర్వాత మరో రెండు వారాల పాటు అలా అలా సాగింది. యాబై రోజులు కూడా ఎక్కువ థియేటర్‌ ల్లో ఉన్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెప్పిందే లేదు.

Advertisement
balakrishna fans trolls about RRR vs Akhanda movies
balakrishna fans trolls about RRR vs Akhanda movies

ఇప్పుడు వంద రోజులు కూడా కనీసం ఒక్క థియేటర్ లో అయినా ఉన్న దాఖలాలు కనిపించడం లేదు. చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ విషయాన్ని చెప్పలేదు కనుక థియేటర్లలో ఆర్ఆర్‌ఆర్‌ లేదని క్లారిటీ వచ్చింది. కాని ఓటీటీ లో ఇంకా కూడా దేశ విదేశాల్లో ఆర్ఆర్‌ఆర్‌ జాతర కొనసాగుతున్న విషయం తెల్సిందే. భారీ ఎత్తున సినిమా ను స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. వంద రోజుల థియేటర్ల విషయంలో బాలయ్య అభిమానులు ఆర్‌ఆర్‌ఆర్ తో పోల్చుకోవడం విడ్డూరంగా ఉందంటూ జక్కన్న అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. నిర్మాతలు తల్చుకుంటే వంద రోజులు కాదు ఏడాది పాటు ఉంచవచ్చు. కాని జక్కన్న అలా కోరుకోడు అంటూ ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement