BalaKrishna : జూనియర్ ఎన్టీఆర్‌ త‌ల్లిని బాల‌య్య అంత‌లా అవ‌మానించాడా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BalaKrishna : జూనియర్ ఎన్టీఆర్‌ త‌ల్లిని బాల‌య్య అంత‌లా అవ‌మానించాడా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :22 November 2022,12:20 pm

BalaKrishna : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌ల్లి, హ‌రికృష్ణ స‌తీమ‌ణి షాలిని బ‌య‌ట ప్ర‌పంచానికి చాలా దూరంగా ఉంటారు. ఎందుకంటే, హ‌రికృష్ణ ఆమెను లీగ‌ల్‌గా పెళ్లి చేసుకోలేద‌ని, స‌హ‌జీవ‌నం మాత్ర‌మే సాగించార‌ని అంటుంటారు. నిజానికి శాలిని ఒక మ్యూజిక్ టీచ‌ర్ కాగా, ఆమె ఎన్టీఆర్ కుటుంబంలోని పిల్ల‌ల‌కు సంగీత పాఠాలు చెప్పేందుకు వ‌చ్చేవారు. ఎన్టీఆర్‌కు చేదోడు వాడోదుగా ఉంటూ హ‌రికృష్ణ ఎక్కువ‌గా ఇంట్లో ఉండ‌డం వ‌ల్ల శాలినితో ప‌రిచ‌యం ఏర్ప‌డి, అది త‌ర్వాత ప్రేమ‌గా మారింది. ఒక్కోసారి శాలినిని స్వ‌యంగా హ‌రికృష్ణ‌నే త‌న కారులో ఇంటి ద‌గ్గ‌ర దింపేవారట‌.

అయితే అప్ప‌టికే హ‌రికృష్ణ‌కు లక్ష్మితో పెళ్లి జ‌రిగి, జానకిరామ్ పుట్టాడు. క‌ళ్యాణ్ రామ్ క‌డుపులో ఉన్న స‌మ‌యంలోనే .. హ‌రికృష్ణ షాలినీతో వేరే కాపురం పెట్టేశాడు. ఈ విష‌యం ఇంట్లో తెలియ‌డం, ఆమెను మ్యూజిక్‌గా టీచ‌ర్‌గా తొలిగించ‌డం వెంటవెంట‌నే జ‌రిగాయి. అనంత‌రం హ‌రికృష్ణ‌ను కుటుంబ‌స‌భ్యులంద‌రూ మంద‌లించిన‌ప్ప‌టికీ ఆయ‌న శాలినితో బంధాన్ని తెంచుకోలేక‌పోయారు. ఇక షాలిని.. హ‌రికృష్ణ‌ని భ‌ర్త‌గా భావించి జీవితం గ‌డిపారు . హ‌రికృష్ణ త‌న రెండో భార్య‌గా శాలినిని అంద‌రికీ ప‌రిచ‌యం చేయ‌క‌పోయినా.. ప్రేమ‌ను మాత్రం ఆమెకే ఎక్కువ‌గా పంచార‌ట‌.

BalaKrishna insult Junior NTR mother so much

BalaKrishna insult Junior NTR mother so much

BalaKrishna : అంత అవ‌మానించారా..!

ఇక నంద‌మూరి మూడో తరంలో జూనియర్ ఎన్టీఆర్‌ స్టార్‌ హీరోగా ఉండ‌గా, బాల‌య్య‌తో ఆయ‌న‌కు ఎప్పటి నుంచో కోల్డ్ వార్ న‌డుస్తుంది. పైకి మాత్రం తాము బాబాయ్, అబ్బాయి అన్నట్టు చెప్తుంటారు. కానీ లోలోపల మాత్రం ఇద్దరికీ కాస్త గ్యాప్ ఉందనేది అంద‌రికి తెలిసిన విష‌యం. అయితే గతంలో జూనియర్ ఎన్టీఆర్‌ను బాలయ్య అవమానించాడనే వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. గతంలో సీనియర్‌ జర్నలిస్టు ఒకరు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఉమ్మడి ఫ్యామిలీ ఫంక్షన్‌కు జూనియర్ ఎన్టీఆర్‌ తన తల్లితో కలిసి హాజరయిన‌ప్పుడు, వారిని చూసిన బాలయ్య అందరి ముందే బయటకు పొమ్మన్నాడంట. దాంతో చేసేదేం లేక జూనియర్‌ ఎన్టీఆర్‌ తన తల్లిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడ‌ని చెప్పారు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది