Balakrishna : బాలకృష్ణ మిస్సింగ్ అంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు.. అసలు ఏం జరిగింది?
Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలతోను పలు షోలతో బిజీగా ఉంటూనే మరోవైపు రాజకీయాలు కూడా చేస్తున్నారు. అఖండ సినిమాతో హిట్ కొట్టిన బాలకృష్ణ మరోవైపు అన్‌స్టాపబుల్ అనే టాక్ షోతోను అదరగొట్టాడు. ప్రస్తుతం గోపిచంద్ మలినేనితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఆయన కనపడడం లేదంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదుకావడం ఇప్పుడు చర్చనీయాంశంగామారింది. బాలకృష్ణ నిజంగానే కనబడడం లేదా…? కనబడకుండా ఆయన ఎక్కడికి వెళ్లారు..? ఆయన కనబడడం లేదంటూ పోలీస్ స్టేషన్ లో ఎవరు ఫిర్యాదు చేశారు? అసలు బాలయ్య బాబు కు ఏమైంది? ఇలా ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఏపీలో కొత్త జిల్లాల విభజన సందర్భంగా పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం లోను ఆందోళనలు మిన్నంటుతున్నాయి . పుట్టపర్తి కేంద్రంగా ప్రభుత్వం సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా.. ఆ నిర్ణయాన్ని హిందూపురం నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ కనబడడం లేదంటూ స్థానిక బీజేపీ నాయకులు స్థానిక వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Balakrishna missing news viral
Balakrishna : బాలయ్య మిస్సింగ్..
ఇప్పటికైనా వారంతా బయటికి వచ్చి, వెంటనే పదవులకు రాజీనామా చేసి, హిందూపురం జిల్లా ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని స్థానిక నేతలు డిమాండ్ చేశారు.పీలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పుడున్న వాటికి అదనంగా మరో 13 జిల్లాలు వచ్చి చేరనున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో 26 జిల్లాలు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై సీఎం జగన్ సారథ్యంలో ఏర్పాటైన కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్నాయి. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల ఆధారంగా జగన్ సర్కార్ జిల్లాల విభజన చేపట్టింది.