Balakrishna : బాలయ్యకు సాష్టాంగ నమస్కారం చేసిన పూర్ణ.. వైరల్ అవుతున్న ఉదయ భాను అతి భక్తి..!
Balakrishna : నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ఆఖండ హ్యాట్రిక్ మూవీగా నిలిచింది. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్లతో దూసుకు పోతోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటించగా.. జగపతి బాబు, శ్రీకాంత్, పూర్ణ, తదితరులు నటించారు. సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న చిత్ర బృందం.. ప్రస్తుతం విజయోత్సవ జాతర కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. గురువారం వైజాగ్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నటి పూర్ణ, సీనియర్ యాంకర్ ఉదయ భాను చేసిన అతి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Balakrishna : ఎవరేం అనుక్కునా పర్లేదు.. బాలయ్య బాబు ఒక్కడే

balakrishna poorna and anchor udayabhanu praises Akhanda Movie
అఖండ విజయోత్సవ సభకు హాజరైన పూర్ణ… బాలయ్య బాబును ప్రశంసల్లో ముంచెత్తారు. సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన బోయపాటికి ధన్యవాదాలు తెలుపుతూనే బాలయ్యతో నటించడం తన అదృష్టమని చెప్పుకొచ్చారు. బాలయ్య బాబుకు ఎవ్వరూ దిష్టి పెట్టకూడదని అన్నారు. శ్రీకాంత్ గారు తనను ఎంత భయపెట్టినా.. బాలయ్య అందం ముందు అదేమీ తనకు పట్టలేదన్నారు. అంతటితో ఆగని పూర్ణ..ఏకంగా బాలయ్యకు అందరి ముందే సాష్టాంగ నమస్కారం చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈ సినిమాలోని అఘోర పాత్ర నన్ను ఇంకా వెంటాడుతునే ఉందని తెలిపింది. వెంటనే అందుకున్న ఉదయభాను తాను ఏమోషనల్ అయింది. బాలయ్యకు తనపై ఉన్న ఉడత భక్తిని చాటుకున్నారు. కరెక్ట్‌గా చెప్పావంటూ పూర్ణను వ్యాఖ్యలతో ఏకీభవించారు.
బాలయ్య గారి గురించి పూర్ణ చెప్పినవన్నీ అక్షర సత్యాలేనని అన్నారు. ఎవరూ ఏమనుకున్నా పర్లేదంటూ.. తనకు ఇంకో షో రాపోయినా అక్కర్లేదంటూ… బాలయ్య బాబు ఒక్కడే.. ఒక్కడే బాలయ్య.. ఆయనకు ఎవ్వరూ సాటి రారు అంటూ ఉదయభాను కూడా ఏమోషనల్ అయింది. ఈ ఇద్దరు బాలయ్యను పొగిడిన వీడియో.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
