Balakrishna : అది పుకారే.. బాలయ్య మరీ అంత కమర్షియల్ కాదు గురూ
Balakrishna : నందమూరి బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఇదే సమయంలో ఆయన టాక్ షో అన్ స్టాపబుల్ రెండవ సీజన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మొదటి సీజన్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో రెండో సీజన్ను మరింత ఆకర్షణీయంగా తీసుకు వచ్చేందుకు ఆహా ఓటీటీ రెడీ అవుతోంది. ఇప్పటికే అధికారిక ప్రకటన చేసిన ఆహా ఈ నెల చివర్లో లేదా సెప్టెంబర్లో సీజన్ టు మొదటి ఎపిసోడ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటికే సీజన్ టూ కి సంబంధించిన చర్చా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి అనే సమాచారం అందుతోంది.
సీజన్ కు గాను భారీ పారితోషికాన్ని బాలకృష్ణ అందుకోబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి గత సీజన్లో తీసుకున్న పారితోషికం కంటే రెండవ సీజన్ కి ఏకంగా రెట్టింపు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే ఒక్కొక్క ఎపిసోడ్కి గతంలో రూ. 5 లక్షల తీసుకుంటే సీజన్ 2 కోసం ఏకంగా పది లక్షల పారితోషికాన్ని అందుకోబోతున్నాడు అనేది టాక్. బాలయ్య రూ. 10 లక్షల పారితోషికం డిమాండ్ చేశాడని, తప్పని పరిస్థితుల్లో ఆహా టీం అంతా పారితోషికాన్ని ఇచ్చేందుకు ఓకే చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
బాలకృష్ణ పారితోషికం పరంగా ఎప్పుడూ కూడా నిర్మాతలను ఇబ్బంది పెట్టింది లేదు. సినిమాలకు నిర్మాతగా ఎంత ఇస్తే అంత పారితోషికం తీసుకునే వాడు, ఇప్పుడు ఈ టాక్ షో విషయంలో కూడా ఆయన ఎక్కువ పారితోషికాన్ని డిమాండ్ చేశాడు అనేది కేవలం పుకారే అయి ఉంటుందని, ఆయన ఖచ్చితంగా అంత కమర్షియల్ మనిషి అయితే కాదని ఇండస్ట్రీ వర్గాల వారు మరియు నందమూరి బాలకృష్ణ అభిమానులు ఇంకా ఆయన సన్నిహితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది ఆ అల్లు అరవింద్ కే తెలియాలి.