Veera Simha Reddy Movie : బాలకృష్ణ ”వీర సింహారెడ్డి” సినిమా స్టోరీ లీక్ .. అచ్చం ఆ సినిమాలానే ఉంది ..!
Veera Simha Reddy Movie : బాలకృష్ణ నటిస్తున్న ‘ వీరసింహారెడ్డి ‘ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా ఇది. అలాగే బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాప్ అబుల్ రెండో సీజన్ కూడా సూపర్ హిట్ అవడంతో వీరసింహారెడ్డికి బాలయ్య కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తుంది. ఈ సినిమా స్టోరీ, డైలాగులు బయటకు లీకయ్యాయి. ఇప్పటికే విడుదలైన జై బాలయ్య సాంగ్, సుగుణసుందరి సాంగ్స్ కి మంచి స్పందన వచ్చింది. అలాగే టైటిల్ లుక్, ఫస్ట్ లుక్ కూడా సూపర్ గా ఉన్నాయి.
వీటిని బట్టి చూస్తే మలినేని గోపీచంద్ సూపర్ హిట్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా నుంచి లీకైన స్టోరీ డైలాగ్స్ అదరగొడుతున్నాయి. ఈ సినిమాలో ఓ డైలాగ్ మామూలుగా లేదు. బాలయ్య ఎడమ కాలు తొడ కొట్టి ఒక అడుగు ముందుకు వేసి విలన్ పీక మీద కాలు పెట్టి పులివెందుల అయినా పులిచర్ల అయినా పులిబిడ్డ ఈ వీరసింహారెడ్డి. ప్రజల ముందు ఉంటే సింహం ముందు ఉన్నట్టే ఆ సింహాన్ని ఎదిరించి వెళ్లి దమ్ముంటే రేయ్ నువ్వు నన్ను దాటి ప్రజల దగ్గరికి వెళ్ళారా అనేదే డైలాగ్. ఈ డైలాగ్ ఎంత పవర్ ఫుల్ గా ఉందో చూస్తే అర్థమవుతుంది.
ఇక ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్స్ చేస్తున్నారు. ఒకటి విలేజ్ బ్యాక్ డ్రాప్ వీరసింహారెడ్డి , రెండవది అమెరికా నుంచి వచ్చే బాల సింహారెడ్డి . ఇవి తండ్రి కొడుకుల క్యారెక్టర్స్. గ్రామ రాజకీయాలలో వీరసింహారెడ్డి చనిపోతే బాలసింహారెడ్డి విలన్లపై పగ తీర్చుకుంటాడు. తన గ్రామం అభివృద్ధి కోసం తన తండ్రి తన కలల్ని తీర్చుతాడు బాలసింహారెడ్డి. సాఫ్ట్ వేర్ నుంచి రాజకీయాల్లోకి వస్తే పిల్ల బచ్చాగాడు అని లైట్ తీసుకున్న వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాడు అన్నది స్టోరీ. ఇక ఈ స్టోరీ వింటుంటే ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అని తెలుస్తుంది.