Balakrishna : మెగా ఫ్యామిలీ పరువు మొత్తం బాలయ్య కాళ్ళ దగ్గర | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Balakrishna : మెగా ఫ్యామిలీ పరువు మొత్తం బాలయ్య కాళ్ళ దగ్గర

 Authored By sandeep | The Telugu News | Updated on :9 October 2022,11:00 am

Balakrishna : అదేంటి అంతమాట అనేసారు అనుకుంటున్నారా..? ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. బాలకృష్ణ గాని ఆ డిసిషన్ తీసుకున్నాడు అంటే మాత్రం నిజంగా మెగా ఫ్యామిలీ పరువు ప్రమాదంలో పడిపోయినట్టే. ఆచార్య సినిమా ఫ్లాప్ అయిన తర్వాత చిరంజీవి మాట్లాడుతూ దర్శకుడు కొరటాల మీద మొత్తం భారం వేయడం.. ఆయన చెప్పినట్టు చేసామని చెప్పడంతో మరింతగా చిరంజీవిని టోల్ చేస్తున్నారు. ఒక్క సినిమా ఫ్లాపాయ్యే సరికి మొత్తం దర్శకుడు మీద ఆ భారం వేస్తున్నాడు.. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ మెగాస్టార్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఇప్పటికే ఆచార్య ఫ్లాప్ తర్వాత చిరంజీవి అభిమానులు చాలా నామోషీగా ఫీల్ అవుతున్నారు..

ఇదే సమయంలో ఇంకా తేడాది బాలకృష్ణ అఖండ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో దాన్ని సాకుగా చూపించి మెగా అభిమానులను సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు నందమూరి ఫ్యాన్స్. ఇలాంటి సమయంలో బాలకృష్ణ ఒక డేరింగ్ డెసిషన్ పైపు అడుగులు వేస్తున్నాడు. అదే గాని జరిగితే మెగా ఫ్యామిలీ పరువు మొత్తం గంగలో కలిసిపోయినట్టే అని ప్రచారం జరుగుతుంది. సాధారణంగానే కెరీర్ లో రిస్కు తీసుకోవడానికి బాలకృష్ణ ఎక్కువగా ఇష్టపడుతుంటాడు. ఆయనకు కథ నచ్చితే చాలు దర్శకుల ట్రాక్ రికార్డుతో పని లేకుండా అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఇదే చేయబోతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవితో డిజాస్టర్ తీసిన దర్శకుడిని బాలయ్య తన లైన్లోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అతను ఎవరో కాదు కొరటాల శివ.. త్వరలోనే బాలకృష్ణతో ఈయన సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. సితార ఎంటర్టైర్మెంట్స్ నిర్మాణంలో ఉన్న సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా బాలకృష్ణ, కొరటాల కాంబినేషన్లో ఓ సినిమా రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమై..

Balakrishna what can do of mega family

Balakrishna what can do of mega family

Balakrishna : బాలయ్య అలా చేశాడంటే..

ఈ కాంబినేషన్లో సూపర్ హిట్ వస్తే మాత్రం చిరంజీవి అభిమానులకు అంతకంటే దారుణమైన పరాభవం మరొకటి ఉండదు. ఎందుకంటే రామ్ చరణ్ తో వినయ విధేయ రామ లాంటి ఫ్లాప్ తీసిన బోయపాటి శ్రీనుతో అఖండ లాంటి హిట్ ఇచ్చాడు బాలకృష్ణ. మీరు ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి మా బాలయ్య హిట్ ఇచ్చాడు అంటూ అప్పట్లోనే సోషల్ మీడియాలో చాలా రచ్చరచ్చ చేశారు అభిమానులు. ఇప్పుడు గానీ కొరటాల శివతో బాలకృష్ణ సూపర్ హిట్ ఇచ్చాడు అంటే మాత్రం మెగా పరువు పూర్తిగా పోయినట్టే. ఎందుకంటే ఆచార్య సమయంలో కొరటాలని చిరంజీవి బాగా ఇబ్బంది పెట్టాడని.. కథలో కూడా మార్పులు చెప్పాడు అంటూ ప్రచారం జరుగుతుంది. అదే బాలయ్య దగ్గర మాత్రం దర్శకులకు పూర్తి ఫ్రీడం ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాడు. అది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యి కొరటాల బాలయ్య సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే మెగాస్టార్ చిరంజీవికి అంతకంటే షాక్ మరొకటి ఉండదు.. అభిమానులకు దాన్ని మించిన దారుణమైన పరాభవం మరొకటి లేదు.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది