Balayya Movies : బాలయ్య సినిమాలలో ఎన్నడూ లేనంత మాస్ సినిమా రాబోతోంది..!!
Balayya Movies : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న హీరోలలో మొదటి వరుసలో నటసింహం నందమూరి బాలయ్య బాబు ఒకరు. ఎటువంటి జోనర్ సినిమా అయిన తనదైన శైలిలో స్క్రీన్ మీద రెచ్చిపోతుంటారు. దర్శకుడు ఏది చెబితే అది చేస్తూ.. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి.. సినిమా చూసే ప్రేక్షకుడిని రక్తి కట్టించగల సత్తా ఉన్న హీరో. ఇటీవల అన్ స్టాపబుల్ షో ద్వారా వేరే హీరోల అభిమానులకు కూడా బాలయ్య మరింత దగ్గరయ్యారు.
ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటే తిరుగులేనిది అని అందరికీ తెలుసు. వీరిద్దరి కలయికలో వచ్చిన.. లెజెండ్, సింహ, అఖండ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. బాలకృష్ణ సినీ కెరియర్ లోనే రికార్డు స్థాయి వసూలు కలెక్ట్ చేయడం జరిగింది. కాగా ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా సెట్ అయింది.
ఇదే విషయాన్ని ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా చెప్పారు. అతి త్వరలోనే అఖండ-2 ఉంటుందని వివరించారు. 2021లో వచ్చిన అఖండ నందమూరి బాలకృష్ణ కెరియర్ లో మొదటి రూ.100 కోట్ల సినిమాగా. అంతేకాదు బాలయ్య కెరియర్ లోనే అఖండ హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మాస్ సెంటర్లలో అత్యధికమైన వసూలు రావటం జరిగింది. మరి ఇప్పుడు బోయపాటి బాలయ్య బాబు కాంబోలో “అఖండ 2” ఎన్నడూ లేనంతగా మాస్ సినిమాగా రూపుదిద్దుకోబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.