Betting Apps : బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌తో కోట్లు గడిస్తున్న సెలబ్రిటీలు.. అలా ఎలా?
ప్రధానాంశాలు:
Betting Apps : బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌తో కోట్లు గడిస్తున్న సెలబ్రిటీలు.. అలా ఎలా?
Betting Apps : బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్నవారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తుండడం మనం గమనించవచ్చు. అయితే సెలబ్రటీల నుంచి సామాన్య మనుషులు సైతం ఈజీగా డబ్బు వస్తుందనే ఆశతో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నారు. ఎక్కువుగా డబ్బులు సంపాదించాలంటే ఈ యాప్‌లో రిజిస్ట్రర్ కావాలంటూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

Betting Apps : బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌తో కోట్లు గడిస్తున్న సెలబ్రిటీలు.. అలా ఎలా?
Betting Apps గాలం ఇలా..
సాధారణంగా యూట్యూబ్ ఇన్‌ఫ్లూయన్సర్స్, బల్లితెర నటులు తమ వీడియోలు, నటన ద్వారా నెలకు సంపాదించే మొత్తం తక్కువుగానే ఉంటుంది. పేరున్న నటులు మాత్రమే లక్షకు పైగా సంపాదించగలుగుతారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా.. ఎంత ఎక్కువమందిని ఆకర్షించి డిపాజిట్ చెయ్యిస్తే అంత ఎక్కువ కమీషన్ వస్తుంది. దీంతో ఎక్కువమంది ఈ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు.
ఇన్‌ఫ్లూయన్సర్స్ చాలామంది టెలిగ్రామ్‌లో గ్రూపులు క్రియేట్ చేస్తున్నారు. సాధారణంగా సెలబ్రెటీలకు చెందిన టెలిగ్రామ్ గ్రూప్స్‌లో ఎక్కువమంది జాయిన్ అవుతూ ఉంటారు. మొదట ఎక్కువమందిని గ్రూపులో చేర్చుకోవడమే లక్ష్యంగా కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ ఆ తర్వాత అదే గ్రూపులో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట యాప్‌లో జాయిన్ అయితే జాయినింగ్ బోనస వస్తుందని, ఆ తర్వాత డిపాజిట్లపై ఇన్సెంటివ్‌తో పాటు లాస్ పేమెంట్‌పై బోనస్ అంటూ బెట్టింగ్ యాప్‌లో రిజిస్ట్రేషన్ అయ్యేలా ఆకర్షిస్తుంటారు.