Bigg Boss 5 telugu : ఆ ఒక్క పదంతో రచ్చ.. కార్తీకదీపం భాగ్యంపై ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ ఫైర్
bigg boss 5 telugu బిగ్ బాస్ 5 తెలుగు bigg boss 5 telugu ఇంట్లో ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్‌కు మంచి ఆదరణే లభించింది. ఆమె తన మంచితనంతో ఇంటా బయట పాజిటివ్ ఇమేజ్ తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ 5 తెలుగు ఇంట్లో అయితే ఏ పని చెబితే ఆ పని చేస్తూ.. అందరికీ సాయపడుతూనే వస్తోందట. వంటగదిలోనే ఉంటూ పనులన్నీ చేసుకుంటూనే వస్తోందట. ఇక అందరికీ తల్లో నాలికలా మారింది.
Priyanka Singh And Karthika Deepam Bhagyam
బిగ్ బాస్ 5 తెలుగు ఆ ఒక్క పదంతో రచ్చ.. కార్తీకదీపం భాగ్యంపై ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ ఫైర్
అయితే నిన్నటి ఎపిసోడ్‌లో మాత్రం ప్రియాంక కాస్త హద్దులు దాటినట్టు అయింది. సీరియల్ నటి ఉమా దేవీ మనకు కార్తీకదీపం అర్దపావు భాగ్యంగా పరిచయం. ఆమె ఇప్పుడు బిగ్ బాస్ bigg boss 5 telugu ఇంట్లో బాగానే రాణిస్తోంది. కానీ నిన్నటి గొడవలో ఉమా, ప్రియాంక మధ్య పెద్ద చిచ్చు రేగినట్టు అయింది. వంట విషయం, పనుల విషయంలో అసలు కథ మొదలైంది.
నాకు నచ్చినట్టు నేను ఉంటాను అని ఉమా దేవీ అనడం, అలా ఎలా అంటారు అని ప్రియాంక సింగ్ వాదించడం జరిగింది. చివరకు పెంపకం, తల్లిదండ్రుల విషయాన్ని ప్రియాంక లాగింది. ఇక ఉమా దేవీని షటప్ అంటూ ప్రియాంక సింగ్ రెచ్చిపోయింది. అలా అనొద్దు అని ఉమా దేవీ అంటూనే ఉంది. కానీ పదే పదే షటప్ అంటూ ప్రియాంక రెచ్చిపోయిది. ఆ తరువాత మళ్లీ కన్నీరు పెట్టేసుకుంది.
Who are the best and worst performers according to you??#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/iA2lGKITeZ
— starmaa (@StarMaa) September 10, 2021