Bigg Boss 6 Telugu : ఆమెని నమ్ముకుని అన్యాయమైన అర్జున్.. శనిలా పట్టుకుని మరీ..!

Authored By Rame Samhith | The Telugu News | Updated on : 23 October 2022, 8:00 pm

BiggBoss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో ఆదివారం దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఈ మంత్ మొదట్లోనే దసరా కోసం స్పెషల్ ఎపిసోడ్ చేయగా మరోసారి ఇదే నెలలో మరో స్పెషల్ ఎపిసోడ్ బిగ్ బాస్ హౌజ్ లో దీపావళి సందడి షురూ అయ్యింది. దీపావళి స్పెషల్ ఎపిసోడ్ సాయంత్రం 6 గంటల నుంచే స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. హౌజ్ లో ఉన్న 15 మందిలో ఈ వారం 13 మంది హౌస్ మెట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. అంతేకాదు పోటాపోటీగా ఓటింగ్స్ కూడా పడినట్టు తెలుస్తుంది.

అయితే హౌజ్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్స్, వీక్ కంటెస్టంట్స్ ఉంటారు ఏడవ వారం కాబట్టి అందరికి ఆట మీద ఓ గ్రిప్ ఏర్పడినట్టు చెప్పుకోవచ్చు. అయితే నామినేషన్స్ లో ఇనయా, వాసంతి, అర్జున్, రోహిత్, మెరినాలు లీస్ట్ ఓటింగ్స్ లో ఉన్నారు. వీరిలో ఈ వారం అర్జున్ హౌజ్ నుంచి బయటకు వచ్చేస్తాడని తెలుస్తుంది. బిగ్ బాస్ లీక్స్ వల్ల ప్రతి వారం ఎవరు రిలీజ్ అవుతున్నారు అన్నది ముందే తెలిసిపోతుంది. అయితే హౌజ్ నుంచి అర్జున్ వెళ్లిపోవడం నిజంగానే షాకింగ్ అని చెప్పొచ్చు. హౌజ్ లో అతనికన్నా ఆట ఆడని వారు చాలామంది ఉన్నారు. ఇక అర్జున్ ఆట విషయానికి వస్తే అతను ఆట మీద కన్నా శ్రీ సత్యని ఇంప్రెస్ చేయడం మీదే ఎక్కువ ఫోకస్ పెట్టాడు అందుకే అతని ఆట గాడి తప్పింది.

Bigg Boss 6 Telugu arjun elimination reason is here

Bigg Boss 6 Telugu arjun elimination reason is here

అంతేకాదు శ్రీ సత్య కోసం ఆటలో కూడా అతను ఆలోచించాడు. ఓ క్లారిటీ లేకుండా ఆట ఆడుతున్నాడు. రేవంత్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టంట్ మీద ఆర్గ్యుమెంట్ కి దిగుతున్నాడు. ఇన్ని ఉన్నా సరే అతనికి ఓ ఛాన్స్ ఇవ్వాల్సి ఉంది కానీ అతనికి ఈక్వల్ గా ఉన్న వారితో కంపేర్ చేస్తే అర్జున్ నే బయటకు పంపించాలని నిర్ణయించుకుంది బిగ్ బాస్ టీం. వాసంతి కూడా వీక్ కంటెస్టంటే కానీ ఆమె ఇప్పుడిప్పుడే ఓపెన్ అప్ అయ్యి హౌజ్ మెట్స్ మీద తిరిగి వాదనకు దిగుతుంది. అందుకే ఆమెని ఉంచారని చెప్పొచ్చు. ఏది ఏమైనా అర్జున్ ఆట చెడగొట్టి ఆమె టాప్ 5కి వెళ్లేలా చేసుకుంది శ్రీ సత్య.

Advertisement

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి