Bigg Boss 6 Telugu : ఫైమాని విన్నర్ చేసే పనిలో చంటి.. బయటకు వచ్చాక భారీ స్కెచ్..!

Authored By Rame Samhith | The Telugu News | Published on: October 12, 2022, 12:30 pm

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 నుంచి ఎలిమినేట్ అయిన చంటి బయటకు వచ్చాక భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ షోకి తనకు సూట్ కాలేదని.. హౌస్ లోకి వెళ్లిన కొద్దిరోజులకే అది అర్ధమైందని. అందుకే టాస్కుల్లో సరిగా పర్ఫాం చేయలేదని అన్నాడు చంటి. జబరద్స్త్ లాంటి స్టేజ్ ని కాదని బిగ్ బాస్ కి వచ్చిన చంటి ఆ ఛాన్స్ సరిగా వాడుకోలేదు. అయితే ఎలిమినేట్ అయిన తను హౌస్ లో మరో కంటెస్టంట్ టైటిల్ విన్నర్ అవడం కోసం పనిచేయాలని చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 6 లో జబర్దస్త్ నుంచి చంటితో పాటుగా ఫైమా కూడా హౌస్ లోకి వచ్చింది.

ఫైమా మాత్రం తనకు వచ్చిన ఆ సదవకాశాన్ని అద్భుతంగా వాడుకుంటుంది. టాస్కులతో పాటుగా హౌస్ లో ఆమె కామెడీ కూడా అలరిస్తుంది. ఫైమా ఆట తీరు చూసి ఆమె పక్కా టాప్ 5 లో ఉంటుందని అనేస్తున్నారు. అయితే ఆల్రెడీ టాప్ లో ఉన్న వారిని దాటుకుని ఫైమా విన్నర్ అవ్వాలంటే కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. అయితే చంటి బయటకు వస్తూ ఫైమాని స్ట్రాంగ్ గా ఉండమని చెప్పాడు. అంతేకాదు తను బయటకు వెళ్లి ఫైమా విన్నర్ అయ్యేలా వర్క్ చేస్తానని అన్నారట. జబర్దస్త్ షో వల్ల ఫైమా క్రేజ్ తెచ్చుకోగా ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా అలరిస్తుంది.

Bigg Boss 6 Telugu chanti working for fima winner 

Bigg Boss 6 Telugu chanti working for fima winner

సీజన్ 6 లో ఫైమా ఆ ఛాన్స్ అందుకోవడం తో పాటుగా ఆమె తన ఆట తీరుతో అందరిని మెప్పిస్తుంది. ఫైమా ని విన్నర్ చేయడానికి చంటి తన జబర్దస్త్ టీం మొత్తాన్ని పనిచేయించాలని అనుకుంటున్నాడట. ఒకవేళ నిజంగానే చంటి అలా చేస్తే మాత్రం ఫైమా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఫైమాకి టైటిల్ అంటే అంత ఈజీ థింగ్ ఏమి కాదు. రేవంత్, గీతు, ఆది రెడ్డి, శ్రీ సత్య వీరంతా కూడా టైటిల్ రేసులో ఉండగా వీరితో పాటు ఫైమా కూడా ఐటిల్ రేసులో నిలవాలని చూస్తుంది. మరి చంటి చేస్తున్న ఈ ప్రమోషన్స్ ఏమేరకు ఫైమాకి హెల్ప్ అవుతాయన్నది చూడాలి.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp