Bigg Boss 6 Telugu : అతని మీద ఫైరు.. ఇతని మీద లవ్వు.. ఇనయా కొత్త గేమ్ స్ట్రాటజీ ఇస్టార్ట్..!
Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో ఫైర్ బ్రాండ్ గాళ్ గా తన వాయిస్ వినిపిస్తున్న కంటెస్టంట్ ఇనయా సుల్తానా. హౌస్ లో తనకు నచ్చని విషయం పట్ల గట్టిగా వాయిస్ వినిపించే ఇనయా సుల్తానా ఆమె వాయిస్ ప్వర్ ని ఆమె ప్లస్ చేసుకోలేకపోతుంది. అనవసరమైన విషయాల్లో తప్ప అవసరమైన టైం లో ఆమె వాయిస్ ఉపయోగపడటం లేదు. ఇక టాస్క్ లో భాగంగా శ్రీహాన్ తో గొడవ ఆమెకి మంచి ఇమేజ్ తెచ్చింది. అయితే అదే ఫైరుని కొనసాగించి ఆమె హౌస్ లో సర్వైవ్ అవ్వాలని చూస్తుంది. శ్రీహాన్ తో ఫైట్ టైం లో ఇనయాకి ఊహించని విధంగా ఆడియన్స్ నుంచి ఆమెకు సపోర్ట్ పెరిగింది.
అయితే శ్రీహాన్ అంటే ఫైర్ అయ్యే ఇనయా సుల్తానా.. హౌస్ లో మరో కంటెస్టంట్ తో మాత్రం లవ్ లో పడ్డదట. ఇది తానే బిగ్ బాస్ తో షేర్ చేసుకుంది. సూర్య మీద ఇనయ క్రష్ బయటపెట్టింది. సూర్య అంటే తనకు ఇష్టమని అతను ఆరోహికి క్లోజ్ గా ఉండటం తను అసూయ పొందానని చెప్పుకొచ్చింది. అయితే ఇనయా సూర్య పై చేసిన ఈ కామెంట్స్ ఆమె ఆట కోసమే చేసిందా లేక నిజంగానే ఆమెకు సూర్య మీద ఆ ఎఫెక్షన్ ఉందా అన్న యాంగిల్ లో ఆడియన్స్ ఆలోచిస్తున్నారు. హౌస్ లో చివరి వరకు కొనసాగాలి అంటే ఎవరి గేమ్ ప్లాన్ వారికి ఉండాల్సిందే. అంతేకాదు ఒకేతరహా ఆట తీరు ప్రదర్శించినా ఆడియన్స్ మెచ్చకపోవచ్చు.

Bigg Boss 6 Telugu inaya new game plan love with surya
అందుకే ఇనయా కొత్తగా సూర్య మీద లవ్ అంటూ మరో ఆట మొదలు పెట్టిందని అంటున్నారు. అయితే రీసెంట్ గా జరిగిన నామినేషన్స్ లో సంకెళ్ల ఇచ్చి ఒకరు నామినేట్ అవ్వాల్సిందని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. అయితే ఈ టైం లో కూడా శ్రీహాన్ తో ఇనయ ఫైట్ కి దిగింది. ఈ సీజన్ లో తాను కప్ కొట్టి నీ కన్నా తాను గొప్ప అని ప్రూవ్ చేసుకుంటా అని ఇనయా ఛాలెంజ్ చేసింది. మరి శ్రీహాన్ మీద ఈ ఫైర్ ఏంటి.. సూర్య మీద ఈ లవ్ ఏంటి అన్నది మరికొద్దిరోజుల్లో క్లారిటీ వస్తుంది. ఇక ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే జాబితాలో లిస్ట్ లో మొదటి పేరు వాసంతి అని తెలుస్తుంది. దాదాపు ఆమెనే ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.