Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ వీళ్లకి కలిసి రాలేదు.. బుల్లితెర ఇమేజ్ డ్యామేజ్ చేసుకుని మరీ.. అంత రిస్క్ తీసుకున్నా కూడా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ వీళ్లకి కలిసి రాలేదు.. బుల్లితెర ఇమేజ్ డ్యామేజ్ చేసుకుని మరీ.. అంత రిస్క్ తీసుకున్నా కూడా..!

 Authored By ramesh | The Telugu News | Updated on :14 December 2022,2:30 pm

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్, Bigg Boss, షో వెళ్తే ఎవరికైనా ఇమేజ్ పెరుగుతుంది కానీ బిగ్ బాస్ షో కి వెళ్లాక ఇమేజ్ డ్యామేజ్ అవడం ఎవరికైనా చూశామా.. అవును బిగ్ బాస్ కి వెళ్లి వారి కెరీర్ రిస్క్ లో పెట్టుకున్న బుల్లితెర సెలబ్రిటీస్ ఉన్నారు. వారిలో మొదటి సీజన్ నుంచి ఆరవ సీజన్ వరకు స్మాల్ స్క్రీన్ పై కాస్స్త కూస్తో ఇమేజ్ ఉన్న వీరు షో కి వెళ్లాక ఆశించిన స్థాయిలో క్రేజ్ తెచ్చుకోలేదు. బిగ్ బాస్ సీజన్ 1 ధన్రాజ్ జబర్దస్త్ నుంచి బిగ్ బాస్ కి వెళ్లాడు.

అతను బయటకు వచ్చినా పెద్దగా అవకాశాలు రాలేదు. బిగ్ బాస్,Bigg Boss వల్ల తనకు పెద్దగా ఒరిగింది ఏమి లేదని ధన్ రాజ్ ఒప్పుకున్నాడు. ఇక సీజన్ 3లో శ్రీముఖి కూడా బిగ్ బాస్ కి వెళ్లింది. రన్నరప్ గా నిలిచిన ఆమె ఆ తర్వాత కొన్నాళ్లు ఎవరికి కనిపించలేదు. ఇక సీజన్ 4లో మళ్లీ జబర్దస్త్ నుంచి అవినాష్ వచ్చాడు. అతను జబర్దస్త్ నుంచి ఎగ్జిట్ అయ్యేందుకు చాలా కష్టపడ్డాడు. అయితే బిగ్ బాస్ వల్ల జబర్దస్త్ కి కొంతమేరకు న్యాయం జరిగిందని చెప్పొచ్చు. ఇక సీజన్ 5 లో ప్రియాంకా సింగ్ కూడా జబర్దస్త్,Jabardasth క్రేజ్ తోనే వచ్చింది.

Bigg Boss 6 Telugu show not good for jabardasth comedians

Bigg Boss 6 Telugu show not good for jabardasth comedians

ఆమె కూడా బాగానే ఆడింది. అయితే ఆఫ్టర్ బిగ్ బాస్ ఆమె కనిపించలేదు. ఇక లేటేస్ట్ సీజన్ 6 లో చలాకీ చంటి, ఫైమా, Chalaki Chanti, Faima, కూడా బిగ్ బాస్ కి వెళ్లారు. చంటి ఐఆరు వారాలకే ఎలిమినేట్ అవగా.. ఫైమా దాదాపు 12వ వారం వరకు వచ్చింది. అయితే వారికి ఉన్న జబర్దస్త్ క్రేజ్ తోనే బిగ్ బాస్ షోలో ఉన్నారు తప్ప సెపరేట్ గా పి.ఆర్ టీం ని మెయింటైన్ చేసే ఛాన్స్ లేదు కాబట్టే.. ఇలా జబర్దస్త్ వారు బిగ్ బాస్ నుంచి వెళ్తున్నరని అంటున్నారు. కనీసం వారికి ఉన్న క్రేజ్ తో టాప్ 5 దాకా అయినా ఉండాల్సింది కానీ అలా ఉండట్లేదు.

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది