Bigg Boss 6 Telugu : కెప్టెన్ గా రేవంత్.. అతనికి టైటిల్ అథత ఉందా లేదా అని తేల్చే వారం ఇదే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 6 Telugu : కెప్టెన్ గా రేవంత్.. అతనికి టైటిల్ అథత ఉందా లేదా అని తేల్చే వారం ఇదే..!

 Authored By ramesh | The Telugu News | Updated on :7 October 2022,2:00 pm

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టాంట్ అయిన రేవంత్ మొదటి వారం నుంచే హౌస్ మెట్స్ తో గొడవలు పెట్టుకున్నాడు. టాస్కుల్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నా ఏదో ఒక విధంగా రేవంత్ కి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మొదటివారం నుంచి కెప్టెన్ అవడానికి ప్రయత్నిస్తున్నా సరే కుదరలేదు. ఫైనల్ గా ఐదవ వారం కెప్టెన్ గా రేవంత్ నిలిచాడు. ఈ వారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఫైనల్ గా సూర్య, బాలాదిత్య, రేవంత్ ల మధ్య పోటీ జరిగింది. అయితే వీరిలో హౌస్ మెంట్స్ సపోర్ట్ తో రేవంత్ కెప్టెన్ గా నిలిచాడు.

టాప్ సింగర్ గా రేవంత్ హౌస్ లోకి అడుగుపెట్టే టైం లోనే టైటిల్ విన్నర్ అయ్యే క్యాండిడేట్ అనే టాక్ వచ్చింద్ది. ఇక మిగతా హౌస్ మెట్స్ కూడా అతన్ని టార్గెట్ చేయడం.. అతని మీద నెగటివ్ కామెంట్స్ చేయడం బయట ఆడియన్స్ లో అతనికి క్రేజ్ పెరిగేలా చేసింది. ఇక ఫైనల్ గా అతను కెప్టెన్ గా నిలిచి తన సత్తా చాటాడు. అయితే రేవంత్ టైటిల్ విన్నర్ అవగలడా లేడా అన్నది ప్రూవ్ చేసేది ఈ వారమే అని చెప్పొచ్చు. కెప్టెన్ గా మిగతా వారు చేసే టైం లో కొద్దిగా అహసహానికి గురైన రేవంత్ అతని కెప్టెన్సీని ఎలా నడిపిస్తాడు అన్నది చూడాలి.

Bigg Boss 6 Telugu new captain Revanth for 5th week

Bigg Boss 6 Telugu new captain Revanth for 5th week

అంతేకాదు హౌస్ మెట్స్ అంతా కూడా రేవంత్ మీద నెగటివ్ ఆలోచనలో ఉన్నారు. వారికి కూడా రేవంత్ తన అసలు ఆట చూపించే టైం వచ్చిందని చెప్పొచ్చు. కెప్టెన్ గా రేవంత్ సూపర్ అనిపిస్తే చాలు అతనికి టైటిల్ రాసి ఇచ్చేందుకు ఆడియన్స్ రెడీగా ఉన్నారు. ఇప్పటికే అతను నామినేషన్స్ లో ఉన్న ప్రతిసారి ఓటింగ్స్ తో టాప్ లో ఉంచుతున్నారు. కెప్టెన్ గా అతను సూపర్ అనిపించుకుంటే మాత్రం ఇక తిరుగు ఉండదని చెప్పొచ్చు. బిగ్ బాస్ 6 లో రేవంత్ కెప్టెన్ గా తన ఆట తీరు మార్చేస్తాడా.. ఈ వారం తో అతను టైటిల్ విన్నర్ గా నిలిచేలా చేసుకుంటాడా లేదా అన్నది చూడాలి. తప్పకుండా రేవంత్ తన ఆటతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు.

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది