Bigg Boss 6 Telugu : ఈ సీజన్ మర్చిపోండి.. బిగ్ బాస్ రేటింగ్ గోవింద.. గోవిందా..!

Authored By Rame Samhith | The Telugu News | Published on: October 19, 2022, 9:30 pm

Bigg Boss 6 Telugu : సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో కేవలం టాస్క్ ల విషయంలోనూ.. ఏవైనా కమాండ్స్ ఇవ్వడంలో బిగ్ బాస్ వాయిస్ వినిపిస్తాడు. చాలా తక్కువసార్లు మాత్రమే బిగ్ బాస్ హౌస్ మెట్స్ కి వార్నింగ్ లాంటిది ఇస్తాడు. ఐదు సీజన్లు.. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఎప్పుడూ లేని విధంగా బిగ్ బాస్ సీజన్ 6 లో హౌస్ మెట్స్ కి దారుణమైన వార్నింగ్ ఇచ్చాడు బిగ్ బాస్. మీకు అసలు ఆట మీద ఆసక్తి లేకపోతే చెప్పండి బిగ్ బాస్ జౌస్ గేటు తెరుస్తున్నాం మీరు వెళ్లిపోవచ్చు అని అన్నాడు. బిగ్ బాస్ సీజన్ 6 లో హౌస్ మెట్స్ టాస్కుల విషయంలో వరుసగా విఫలమవుతూ వస్తున్నారు.

అంతకుముందు హోటల్ టాస్క్ లో కూడా బిగ్ బాస్ మధ్యలోనే ఆ టాస్క్ ని క్యాన్సిల్ చేసేలా ఆడారు. ఇక ఇప్పుడు ఏకంగా కెప్టెన్సీ టాస్క్ ని కూడా బిగ్ బాస్ క్యాన్సిల్ చేసేలా హౌస్ మెట్స్ ప్రవర్తించారు. ఏడవ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా సినీ హీరోల పాత్రలను హౌస్ మెట్స్ కి ఇచ్చి వారిలా ఇమిటేట్ చేసి ఎంటర్టైన్ చేయమన్నారు. కేవలం బిగ్ బాస్ చెప్పినప్పుడు మాత్రమే వారు ఆ పాత్రల నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. బిగ్ బాస్ చెప్పేంత వరకు హౌస్ మెట్స్ ఆ పాత్రల్లోనే ఉండాలి. అయితే రేవంత్, అర్జున్ కళ్యాణ్ లు ఈ టాస్క్ లో వారు చేస్తున్న పాత్రల నుంచి బయటకు వచ్చి వాదులాడారు. ఇది గమనించిన బిగ్ బాస్ హౌస్ మెట్స్ అందరిని గార్డెన్ ఏరియాకి రమ్మని చెప్పి..

Bigg Boss 6 Telugu rating for housemates negligance

Bigg Boss 6 Telugu rating for housemates negligance

హౌస్ మెట్స్ కి క్లాస్ పీకుతాడు. ఈ సీజన్ లో హౌస్ మెట్స్ ఎవరికి బిగ్ బాస్ టాస్కుల మీద.. ఆట మీద ఆసక్తి లేదని అర్ధమైంది. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో కూడా విఫలమయ్యారు అంటూ ఫైర్ అయ్యాడు. దాని వల్ల బిగ్ బాస్ ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కూడా క్యాన్సిల్ చేస్తున్నట్టు చెప్పాడు. అసలే టి.ఆర్.పి రేటింగ్స్ లో వీక్ గా ఊగిసలాడుతున్న బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పుడు ఈ వార్నింగ్ వల్ల పూర్తిగా గ్రాఫ్ పడిపోయిందని చెప్పొచ్చు. ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షోలో ఇలా హౌస్ మెట్స్ మీద ఫైర్ అయిన సీన్ ఎప్పుడూ చూడలేదు. అయితే ఇప్పటికే షో మీద ఆడియన్స్ కి ఆసక్తిపోగా దీని వల్ల మరింత డ్యామేజ్ జరుగుతుందని చెప్పొచ్చు.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp