Bigg Boss 6 Telugu : శ్రీసత్య చేతిలో కీలుబొమ్మగా మారిన శ్రీహాన్.. తాను ఎలిమినేట్ అయినా పర్లేదని శ్రీసత్యను కాపాడేశాడు
Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 దగ్గర పడుతోంది. ఇప్పటికే 11 వారాలు పూర్తయ్యాయి. ఇంకా మూడు నాలుగు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 6 పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే.. బిగ్ బాస్ హౌస్ లో రోజురోజుకూ ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే హౌస్ లో పలు జంటలు బయటపడ్డ విషయం తెలిసిందే. తాజాగా శ్రీహాన్, శ్రీసత్య.. ఇద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ తాజాగా పెట్టిన ఓ టాస్క్ లో అది బయటపడింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ల మధ్య ఎన్ని గొడవలు పెట్టాలనుకుంటారో..
ఎలాంటి సమస్యలు సృష్టించాలని అనుకుంటారో తెలుసు కదా. తాజాగా ఎవిక్షన్ పాస్ పేరుతో బిగ్ బాస్ రచ్చ రచ్చ చేశాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను ఉపయోగించాలనుకునే వాళ్లు ఎవరైనా ముగ్గురు ముందుకు వచ్చి ఒక్కో స్లాట్ ను కొనుక్కోవాలి. వాళ్లే ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీ పడతారు అంటాడు బిగ్ బాస్. శ్రీహాన్.. శ్రీసత్య కోసం ఏం చేస్తున్నాడో.. తన కోసం ఎంత పరితపించి పోతున్నాడో మనం చూస్తున్నాం కదా. తనను హౌస్ లో ఉంచాలని కూడా శ్రీహాన్ చాలా తాపత్రయ పడుతున్నాడు. ఒకవేళ ఎవరైనా విన్నర్ అయితే.. ఆ విన్నర్ అమౌంట్ నుంచి కట్ చేసి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇస్తాం అని బిగ్ బాస్ చెప్పినా..
Bigg Boss 6 Telugu : శ్రీసత్య కోసం ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ లో పోటీ పడ్డ శ్రీహాన్
శ్రీసత్య కోసం విన్నింగ్ అమౌంట్ మొత్తం వదులుకోవడానికి కూడా శ్రీహాన్ వెనుకాడటం లేదు. అందుకే.. రూ.1,50,000 డబ్బును వదులకొని ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ట్రై చేశాడు. నిజానికి.. ఈ ఫ్రీ పాస్ ఫైమాకు వచ్చినా.. శ్రీసత్య కోసం అన్ని డబ్బులు వదులుకున్నా శ్రీహాన్ లో కొంచెం కూడా పచ్చాతాపం లేదు. అసలు.. ఎందుకు నువ్వు ఇంత రిస్క్ చేస్తున్నావని శ్రీసత్య అడగడంతో నీకోసమే అంటూ తన మనసులో మాటను చెప్పుకొచ్చాడు శ్రీహాన్. కనీసం ఒక వారం అయినా నువ్వు నాతో ఉంటావు కదా అంటూ చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.