Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ 6 టైటిల్ రేసులో ఉన్న ఆ కంటెస్టంట్.. అది ఒక్కటి మార్చుకుంటే చాలు..!

Authored By Rame Samhith | The Telugu News | Published on: October 13, 2022, 11:30 am

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 నెల రోజులు పూర్తి చేసుకుంది. సీజన్ 6 లో 21 మంది కంటెస్టంట్స్ హౌస్ లోకి వెళ్లగా.. ఇప్పటివరకు ఐదుగురు హౌస్ మెట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఇప్పటికే టాప్ 5 లో ఎవరు వెళ్తారు అన్నది లెక్కలు వేసుకుంటున్నారు. టాప్ 5 మాత్రమే కాదు బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ గా గెలిచే అవకాశం ఉన్న వారి గురించి డిస్కషన్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 6 లో టైటిల్ గెలిచే అవకాశం ఉన్న మొదటి కంటెస్టంట్ రేవంత్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ అతను ఒక స్టార్ సింగర్ గా మంచి ఫాలోయింగ్ ఉంది. రేవంత్ కి ఖచ్చితంగా తన ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ కలిసి వస్తుందని చెప్పొచ్చు.

అంతేకాదు హౌస్ లో అందరు అతన్ని కొన్ని సందర్భాల్లో టార్గెట్ చేయడం కూడా రేవంత్ కి ప్లస్ అవుతుంది. అందుకే కెప్టెన్ గా ఉన్న ఈ వారం తప్ప మిగతా నాలుగు వారాలు రేవంత్ నామినేషన్స్ లో ఉన్నాడు. ప్రతి వారం నామినేషన్స్ లో ఉండటం వల్ల అతని ఓటింగ్ పర్సెంటేజ్ భారీగా పెరిగింది. ఆల్రెడీ బయట మంచి ఇమేజ్ ఉన్న అతను ఇప్పుడు టాప్ 5 కాదు కాదు టైటిల్ విన్నర్ అవడం పక్కా అన్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. రేవంత్ తర్వాత ఆ లిస్ట్ లో ఉన్న మరో కంటెస్టంట్ శ్రీహాన్. అతనికి కూడా బయట సిరి అండ్ టీం వల్ల సూపర్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి.శ్రీహాన్ కూడా చివరి వారం గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నాడు.

Bigg Boss 6 Telugu whos is the winner for this season

Bigg Boss 6 Telugu whos is the winner for this season

శ్రీహాన్ ఓటింగ్ కూడా రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. కేవలం ఆట మీదే దృష్టి పెట్టి శ్రీహాన్ తన ఫాలోవర్స్ ని అలరిస్తున్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 6 లో టైటిల్ విన్నర్ గా అయ్యే ఛాన్స్ ఉన్న మరో కంటెస్టంట్ ఫైమా. జబర్దస్త్ కమెడియన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఫైమా హౌస్ లో కూడా తన కామెడీతో అలరిస్తుంది. సీజన్ 6 లో ఫైమా ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుందని ఫిక్స్ అవ్వొచ్చు. ఒకవేళ రాబోయే రోజుల్లో ఆట కూడా సరిగా ఆడి ఆడియన్స్ కి కనెక్ట్ అయితే ఆమె టైటిల్ గెలిచినా గెలవొచ్చని అంటున్నారు. ఇలా బిగ్ బాస్ సీజన్ 6లో నలుగురు మధ్య గట్టి పోటీ ఏర్పడుతుందని చెప్పొచ్చు. మరో స్ట్రాంగ్ కంటెస్టంట్ గీతా కూడా ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుందని ఫిక్స్ అవ్వొచ్చు.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp