Bigg Boss 8 Telugu : మూడు వారాల‌కే త‌ట్టా బుట్టా స‌ర్ధుకొని బ‌య‌ట‌కొచ్చిన సిద్దిపేట అబ్బాయి.. బిగ్ బాస్‌ని తిట్ట‌డానికి కార‌ణ‌మిదే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 8 Telugu : మూడు వారాల‌కే త‌ట్టా బుట్టా స‌ర్ధుకొని బ‌య‌ట‌కొచ్చిన సిద్దిపేట అబ్బాయి.. బిగ్ బాస్‌ని తిట్ట‌డానికి కార‌ణ‌మిదే !

 Authored By ramu | The Telugu News | Updated on :23 September 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Bigg Boss 8 Telugu : మూడు వారాల‌కే త‌ట్టా బుట్టా స‌ర్ధుకొని బ‌య‌ట‌కొచ్చిన సిద్దిపేట అబ్బాయి.. బిగ్ బాస్‌ని తిట్ట‌డానికి కార‌ణ‌మిదే !

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స‌క్సెస్ ఫుల్‌గా మూడు వారాలు పూర్తి చేసుకుంది. మూడో వారం అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ ను బండ బూతులు తిట్టిన అతనిపై హోస్ట్ నాగార్జన కూడా ఫైరయ్యారు. రెడ్ కార్డ్ చూపించి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లమన్నారు. దీంతో శనివారమే అభయ్ నవీన్ ఎలిమినేట్ అవుతాడని చాలా మంది భావించారు. కాని నాగార్జున రిక్వెస్ట్ చేయగా బిగ్ బాస్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే శనివారం సేఫ్ అయిన అభయ్ నవీన ఆదివారం మాత్రం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోలేకపోయాడు.

Bigg Boss 8 Telugu అందుకే తిట్టా..

ఓటింగ్ తక్కువగా ఉండడంతో అభయ్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో ఎనిమిదో సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లోకి మూడో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన అభయ్ నవీన్ సరిగ్గా మూడు వారాలకే బ్యాగ్ సర్దేసుకున్నాడు. కాగా షో ప్రారంభంలో అభయ్ నవీన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చాలా మంది భావించారు. కానీ అతను ఏ మాత్రం ఎఫెక్టివ్ గా గేమ్ ఆడలేకపోయాడు. టాస్కులు, గేముల్లోనూ పూర్తిగా డల్ అయిపోయాడు. గొప్పలకు పోయి సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. చివరకు అదే కొంప ముంచిది. మ‌రోవైపు బిగ్ బాస్‌ని నానా తిట్టు తిట్ట‌డం కూడా అత‌నికి మైన‌స్ అయింది.

Bigg Boss 8 Telugu మూడు వారాల‌కే త‌ట్టా బుట్టా స‌ర్ధుకొని బ‌య‌ట‌కొచ్చిన సిద్దిపేట అబ్బాయి బిగ్ బాస్‌ని తిట్ట‌డానికి కార‌ణ‌మిదే

Bigg Boss 8 Telugu : మూడు వారాల‌కే త‌ట్టా బుట్టా స‌ర్ధుకొని బ‌య‌ట‌కొచ్చిన సిద్దిపేట అబ్బాయి.. బిగ్ బాస్‌ని తిట్ట‌డానికి కార‌ణ‌మిదే !

ఇక బ‌య‌ట‌కి వ‌చ్చాక బిగ్ బాస్ ని ఎందుకు తిట్టారు. ఒక మనిషి పదిమందికి వంట చేయొచ్చు. అలాంటి ముగ్గురు ఆరుగురికి వంట చేయలేరా? అని ప్రశ్నించగా.. ‘వాస్తవానికి చేయొచ్చు. కానీ. మూడు రోజుల నుండి మాకు సరైన తిండి లేదు. సడెన్ గా రేషన్ వచ్చింది. రేషన్ వచ్చిందేనని సంతోష పడే లోపే టైమర్ వచ్చింది. ఒక్క మనిషి పది మందికి ఎప్పుడు వండుతాడు. టైం లిమిట్ లేకపోతే వండుతాడు. ఎలాంటి కండీషన్స్ లేకుండా ఉంటే వండుతాడు. కానీ.. గంటలో వండుకోవాలంటే ఎలా ? అని సమాధానమిచ్చారు అభయ్. హౌస్ లో రేపటి పుడ్ కూడా ఈ రోజే వండుకునే వాళ్లం. అలాంటి పుడ్ తినలేక ఆదిత్య ఓం చాలా ఇబ్బంది పడ్డారు. పుడ్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నని తనకు చెప్పాడు. అందుకే బిగ్ బాస్ మీద రియాక్ట్ కావాల్సి వచ్చింది. దెబ్బ తగిలిన తరువాత ఆయింట్మెంట్ పెట్టుకోవడం కంటే.. దెబ్బ తగలకుండా చూసుకోవడమే మేలు కాదా అనేది నా పాలసీ.. అంటూ సెటైరికల్ పంచ్ వేశారు అభయ్.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది