Bigg Boss Adi Reddy : రెండో పెళ్లి చేసుకుంటానంటున్న ఆదిరెడ్డి.. కత్తిలాంటి అమ్మాయిలని చూడగానే ఆలోచన వచ్చిందా?
Bigg Boss Adi Reddy : బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం రసవత్తరంగా సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. హౌజ్ నుంచి ఇప్పటికీ 12 మంది వెళ్లిపోగా.. ప్రస్తుతం హౌజ్ లో 9 మంది మాత్రమే ఉన్నారు. ఇక ఈ వారం బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. అంటే కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా ఒక్కో రోజు వచ్చి హౌజ్ లో సందడి చేయడంతో పాటు పలు సూచనలు అందిస్తారు. దీంతో ఈ వీక్ అంతా కంటెస్టెంట్స్ కు చాలా సంతోషంగా, ఎమోషనల్ గా కూడా ఉంటుంది.. ఫ్యామిలీ వీక్ లో భాగంగా ముందుగా ఆదిరెడ్డి భార్య, అతని పాప హౌజ్ లోకి వచ్చి సందడి చేశారు.
గేమ్ లో కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసి మెలిసి ఉండండని కవిత సలహా ఇచ్చింది. నన్ను కూడా కొట్టమంటావా? అని ఆదిరెడ్డి అడగడంతో, నిన్ను కూడా నువ్వేమన్నా తోపా అని కవిత పంచ్ వేయడంతో ఇంటి సభ్యులు పెద్దగా నవ్వేశారు. రోహిత్, మెరీనాల ప్రస్తావన వచ్చినప్పుడు మీరు చాలా క్యూట్‌గా ఉంటారని తెలపగా, అప్పుడు ఆది రెడ్డి అవును కవిత నాకు ఎంతో నచ్చారు. వీరినిచూశాక నాకు రెండో పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అని అన్నాడు. దీంతో ఫస్ట్ ఉన్న దాన్ని బాగా చూసుకో అంటూ కౌంటర్ ఇచ్చింది కవిత. ఇక హౌస్లో ఉన్న కారణంగా ఆదిరెడ్డి కూతురు ఫస్ట్ బర్త్ డే మిస్ కాగా, బిగ్ బాస్ హౌస్లో కేక్ అరేంజ్ చేసి కట్ చేయించాడు.
Bigg Boss Adi Reddy : ఆదిరెడ్డికి పంచ్ అదిరింది..!
ఇంటి సభ్యుల మధ్య ఆదిరెడ్డి తన కూతురు బర్త్ డే వేడుకలు చేయగా , ఈ సందర్భంగా బిగ్ బాస్‌కి ఆదిరెడ్డి థ్యాంక్స్ చెప్పారు. ఓ కామన్ మ్యాన్ హౌజ్‌కి వచ్చి 12 వారాలుఉండటం గొప్ప విషయమని, తన ఫ్యామిలీని బిగ్ బాస్‌లో చూసుకున్నానని, ఇంతకంటేఏం కావాలి బిగ్ బాస్ ఆంటూ చాలా భావోద్వేగానికి గురయ్యాడు ఆదిరెడ్డి. ఇక రెండో టాస్క్ అనంతరం రాజ్ తల్లిని ఇంట్లోకి పంపించి రాజ్‌ని సర్‌ప్రైజ్ చేయగా, రాజ్ వాళ్లమ్మ అందరి ఆటతీరుపై ప్రశంసలు కురిపించింది. అదే సమయంలో ఫస్ట్ టైమ్‌లో తనని బయటి ప్రపంచానికి తన ఫ్యామిలీని చూపించానని, చాలా ఆనందంగా ఉందని రాజ్, వాళ్లమ్మ తెగ గర్వపడ్డారు.