Divi Vadthya : పొలంలో పరువాల విందు.. బిగ్ బాస్ దివి యావ్వారం మామూలుగా లేదు
Divi Vadthya : మహర్షి చిత్రంలో ఓ చిన్నరోల్‌లో కనిపించిన దివి.. హీరోయిన్‌గా సెటిల్ కావాలని అనుకుంటుంది. అయితే బిగ్‌బాస్ ఎంట్రీకి ముందు దివి గురించి పెద్దగా ఎవరికి తెలియదనే చెప్పాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో పాల్గొన్న దివి.. తన అందంతో పాటు టాలెంట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. అక్కడ తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ బయటకు వచ్చాక.. మరింతగా రెచ్చిపోయింది. నడుము అందాలను ప్రదర్శిస్తూ నెట్టింట్లో రచ్చ చేస్తుంటుంది.
ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ తన అందమైన ఫొటోలతో అభిమానులను అలరిస్తుంది. అంతేకాకుండా తనకు ఎంతో ఇష్టమైన సినీ రంగంలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది. కొన్ని నెలల క్రితం ఓటీటీలో వచ్చిన క్యాబ్ స్టోరీస్‌లో దివి హీరోయిన్‌గా అలరించింది. ప్రస్తుతం మరో కొన్ని వెబ్ సిరీస్‌లలో కూడా ఈ బ్యూటీ నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లంటూ ఫుల్ బిజీగా ఉంది.

Bigg boss divi vadthya Stunning Look on farm fields
Divi Vadthya : దివి అందాల జాతర..
అయితే సోషల్ మీడియాతో తనదైన అందంతో అభిమానుల్లో హీట్ పెంచుతున్న ఈ భామ తాజాగా షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పొలంలో చాలా న్యాచురల్‌గా తన నడుం అందాలను చూపిస్తూ దివి పరువాల విందు చేసింది. అంతే కాకుండా ‘అగ్గిపుల్ల లాంటి ఆడపిల్ల నేను.. నువ్వు చిన్నచూపు చూస్తే ఉరుకోను, ఎందులోనా నీకు నేను తీసిపోను.. నిన్నుచూస్తే గిల్లకుండా ఉండలేను..’ అంటూ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ సాంగ్‌లోని లిరిక్స్‌ను జత చేసింది. ఇది చూసిన జనాలు దివి యవ్వారం మాములుగా లేదుగా అంటున్నారు.