Bigg Boss Telugu 7 : కెప్టెన్‌గా ప్రశాంత్ పనికిరాడు.. హౌస్‌మెట్స్ అంతా ఏకమయ్యారు.. ప్రశాంత్ కెప్టెన్సీని పీకేశారు.. ప్రశాంత్‌ను ఎలిమినేట్ చేస్తారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss Telugu 7 : కెప్టెన్‌గా ప్రశాంత్ పనికిరాడు.. హౌస్‌మెట్స్ అంతా ఏకమయ్యారు.. ప్రశాంత్ కెప్టెన్సీని పీకేశారు.. ప్రశాంత్‌ను ఎలిమినేట్ చేస్తారా?

 Authored By kranthi | The Telugu News | Updated on :11 October 2023,11:00 am

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో తొలి కెప్టెన్ అయి పల్లవి ప్రశాంత్ రికార్డు సృష్టించాడు. కానీ.. తన కెప్టెన్సీ ముణ్నాళ్ల ముచ్చటే అయింది. ఎందుకంటే.. కెప్టెన్ అయిన మూడు రోజులకే ఆయన కెప్టెన్సీ పోయింది. నిజానికి కెప్టెన్ అనేది పెద్ద బాధ్యత. బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అంటే అతడు చెప్పిందే అందరూ వినాలి. హౌస్ మెట్స్ తో అన్ని పనులు చేయించాలి. హౌస్ ను సరిగ్గా చూసుకోవాలి. అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఫుడ్ విషయంలో సరిగ్గా ఉండాలి. సరుకులు అయిపోతే బిగ్ బాస్ తో తెప్పించాలి. ఇలా హౌస్ లో కెప్టెన్ దే తుది నిర్ణయం అవుతుంది. కానీ.. తొలి కెప్టెన్ గా ఎన్నికైన పల్లవి ప్రశాంత్ కెప్టెన్ గా అనర్హుడు అని ఇంట్లో ఉన్న వాళ్లంతా చేతులెత్తారు. అవును.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. హౌస్ మెంట్స్ అందరూ కెప్టెన్ గా ప్రశాంత్ విఫలం అయ్యాడు అని చేతులెత్తారు.

అసలు కెప్టెన్ విధులేంటి.. ఒక మంచి కెప్టెన్ అనిపించుకోవాలంటే ఏం చేయాలి అని బిగ్ బాస్ హౌస్ మెట్స్ అందరినీ అడిగాడు. దీంతో ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పారు. ప్రశాంత్ ను కూడా అడగడంతో కెప్టెన్ పనులు చేస్తూ అందరితో చేయించాలి. కానీ.. ఎవ్వరూ నా మాట వినడం లేదు బిగ్ బాస్ అని డైరెక్ట్ గా చెప్పేశాడు ప్రశాంత్. నేను చెప్పింది ఎవ్వరూ వింటలేరు. కొన్ని పనులు చెప్పిన.. కొందరు వీడేంది చెప్పడం అన్నట్టుగా చూశారు. కెప్టెన్ అనేవాడు నేను చేస్తూ వాళ్లతో చేయించాలి అంటూ ప్రశాంత్ చెప్పినా బిగ్ బాస్ కన్విన్స్ అవ్వడు. తను బ్యాడ్ కెప్టెన్ అని శివాజీ కూడా చేతులెత్తుతాడు. దీంతో ప్రశాంత్ కెప్టెన్సీని రద్దు చేసి కెప్టెన్సీ బ్యాడ్జ్ ను బిగ్ బాస్ తిరిగి తీసుకుంటాడు.

bigg boss first captain prashanth captaincy cancelled by bigg boss

#image_title

Bigg Boss Telugu 7 : కంటతడి పెట్టిన ప్రశాంత్

తన కెప్టెన్సీ కేవలం ఇంటి సభ్యుల వల్ల పోవడంతో ప్రశాంత్ వెక్కి వెక్కి ఏడుస్తాడు. ప్రశాంత్ కెప్టెన్సీ పోవడంతో బ్యాడ్జీ తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెడతాడు. మొత్తానికి ప్రశాంత్ కు వచ్చినట్టే వచ్చి కెప్టెన్సీ పోతుంది. దీంతో బిగ్ బాస్ ఇంటి మొదటి కెప్టెన్ కోసం మళ్లీ టాస్క్ స్టార్ట్ అవుతుంది. మళ్లీ బిగ్ బాస్ కొత్త కెప్టెన్ కోసం ఎలాంటి టాస్క్ పెడతాడో చూడాల్సిందే.

YouTube video

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది