Bigg Boss Hari Teja : బిగ్ బాస్ హరి తేజకు ఏమైంది?.. అలాంటి పోస్ట్ ఎందుకు పెట్టింది?
Bigg Boss Hari Teja : బిగ్ బాస్ షోతో హరితేజకు వచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఆమెకు అంతకు ముందు కూడా కాసింత క్రేజ్ ఉండేది. బుల్లితెరపై సీరియల్స్ ద్వారా బాగానే ఫేమస్ అయింది. నెగెటివ్ కారెక్టర్లు కూడా హరితేజ పోషించింది. అయితే బిగ్ బాస్ షోతో మాత్రం హరితేజ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. బిగ్ బాస్ షోలో విన్నర్ అయ్యేంత క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ ఇంట్లో తన మల్టీ టాలెంట్‌ను చూపించింది. కూచిపూడి నాట్యం, సింగర్, బుర్రకథలు ఇలా అన్నీ చేసి చూపించింది. మరీ ముఖ్యంగా తన కామెడీ టైమింగ్‌కు అందరూ ఫిదా అయ్యే వారు.అలా మొత్తానికి బిగ్ బాస్ మొదటి సీజన్లో హరితేజకు మంచి క్రేజ్ వచ్చింది.
ఆ తరువాత హరితేజకు మంచి ఆఫర్లు రావడం మొదలయ్యాయి. సిల్వర్ స్క్రీన్ మీద మంచి కమెడియన్‌గా మారిపోయింది. ఎన్నో సినిమాల్లో నవ్విస్తూ వచ్చింది. ఇక ఈ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. తల్లి అవ్వడంతో ఇలా బ్రేక్ ఇచ్చింది. మళ్లీ వర్కవుట్లు చేసి చాలా కష్టపడి మునుపటి రూపాన్ని తెచ్చుకుంది. అయితే నెట్టింట్లో మాత్రం హరితేజ ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ మధ్యే వెకేషన్‌కు వెళ్లి వచ్చారు. నవ్యస్వామి, ఐశ్వర్య, హరితేజ ముగ్గురు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురూ కలిసి మాల్దీవుల వెకేషన్లకు వెళ్లారు. ఫ్యామిలీ ట్రిప్ అంటూనే అక్కడ నానా హంగామా చేసి వచ్చారు. అలా మొత్తానికి నవ్యస్వామి, హరితేజ ఫోటోలునెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టాయి.
హరితేజ అప్పుడప్పుడు తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తుంటుంది. అలా ఫ్యాన్స్ కోరిక మేరకు పాటలు కూడా పాడుతుంటుంది. తాజాగా హరితేజ ఓ కొటేషన్ చెప్పింది. కంచు మోగినట్టు కనకంబు మోగునా అనేట్టు ఓ శతకాన్ని చెప్పుకొచ్చింది. డబ్బాలో రాళ్లు ఎక్కువ చప్పుడు చేస్తాయని నోట్ల కన్నా రాళ్లు గొప్పవని చెప్పగలమా?.. గొప్ప వస్తువులు ఎప్పుడూ కూడా ఎక్కువ శబ్దాలు చేయవు అని చెప్పుకొచ్చింది హరితేజ. మరి ఇలా ఎందుకు అంది.. తనను ఎవరైనా ట్రోల్స్ చేస్తే ఇలా సమాధానం ఇచ్చిందా? అన్నది తెలియడం లేదు.