Bigg Boss Himaja : అదే జరిగితే నా మొగుడిని అయినా వదిలేస్తా.. బిగ్ బాస్ హిమజ కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss Himaja : అదే జరిగితే నా మొగుడిని అయినా వదిలేస్తా.. బిగ్ బాస్ హిమజ కామెంట్స్

 Authored By kranthi | The Telugu News | Updated on :6 January 2023,2:20 pm

Bigg Boss Himaja : బిగ్ బాస్ బ్యూటీ హిమజ తెలుసు కదా. తన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియళ్ల ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన హిమజ ఆ తర్వాత తనదైన శైలిలో గుర్తింపు పొంది సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంది. ఆ తర్వాత తనకు బిగ్ బాస్ లో అవకాశం రావడంతో తన రేంజే మారిపోయింది. తన పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. సోషల్ మీడియాలో తనకు ఉన్న ఫాలోయింగ్ మామూలుగా ఉండదు

. మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు తనకు. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది హిమజ. తాజాగా ఇన్ స్టా లైవ్ లోకి వచ్చిన హిమజ పెళ్లయ్యాక భర్తలు మారితే ఎలా అనే కాన్సెప్ట్ పై మాట్లాడింది. ఇన్ స్టా లైవ్ లో ఓ నెటిజన్.. పెళ్లయ్యాక భర్త మారిపోతే ఏం చేస్తారు అంటూ అడిగారు. దీంతో ఆ ప్రశ్నకు దీటైన సమాధానం చెప్పింది హిమజ. 25 ఏళ్లు పెంచిన నాన్ననే వదిలేస్తాం.. !!

bigg boss himaja comments

bigg boss himaja comments

Bigg Boss Himaja : మొగుడు ఒక లెక్కా అంటూ చెప్పుకొచ్చిన హిమజ

నాన్నను వదిలేసి మెగుడి దగ్గరికి వెళ్తాం. మరి.. అలాంటిది మీరు ఒక లెక్కా… మొగుడైనా.. ఎవరైనా సరే వదిలేస్తాం అంటూ మొగుడు మారిపోతే ఎలా అనే ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చింది హిమజ. నిజానికి.. ఫన్నీగానే తన వీడియో ఉన్నా.. ఆ ఎమోషన్ కు హిమజ బాగా కనెక్ట్ అయింది. అంతగా ఎమోషనల్ అయిన హిమజను చూసి నెటిజన్లు కూడా షాక్ అయ్యారు. ప్రస్తుతం తన ఇన్ స్టా వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది