Bigg Boss OTT : బిగ్ బాస్ ఓటీటీ లిస్ట్ ఇదే.. పాత కంటెస్టెంట్స్ ఎక్కువగా ఉన్నారుగా..!
Bigg Boss OTT : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో ఎంటర్‌టైన్ చేస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం తెలుగులో ఐదు సీజన్స్ పూర్తి చేసుకుంది. తాజాగా ఓటీటీ షో జరుపుకుంటుంది. హిందీలో సక్సెస్ కావడంతో తమిళంలో, తెలుగులో ఓటీటీ స్టార్ట్ చేశారు. తెలుగులో నేటి నుండి ఓటీటీ షో మొదలు కాగా, ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్స్‌పై క్లారిటీ వచ్చింది. గత కొద్ది రోజులుగా ప్రచారాలు సాగగా, కొద్ది సేపటి క్రితం పూర్తి క్లారిటీ వచ్చింది. తొలి కంటెస్టెంట్‌గా అశు రెడ్డి ఎంట్రీ ఇవ్వగా , రెండో కంటెస్టెంట్‌గా మహేష్ విట్టా, మూడో కంటెస్టెంట్‌గా ముమైత్ ఖాన్ ఎంట్రీ ఇచ్చారు. వీరు అందరూ పాత వాళ్లే..
నాల్గవ కంటెస్టెంట్‌గా అజయ్ అనే కొత్త కంటెస్టెంట్ వచ్చారు. ఇక ఐదో కంటెస్టెంట్‌గా స్రవంతి చోకరపు ఎంట్రీ ఇచ్చారు. ఆరో కంటెస్టెంట్‌గా ఆర్ జే చైతూ వచ్చారు. ఏడో కంటెస్టెంట్‌గా యాంకర్ అరియానా ఎంట్రీ ఇచ్చారు.ఎనిమిదో కంటెస్టెంట్‌గా నటరాజ్ మాస్టర్ వచ్చారు. తొమ్మిదో కంటెస్టెంట్‌గా శ్రీరాపాక ఎంట్రీ ఇచ్చారు. పదో కంటెస్టెంట్‌గా అనిల్ రాథోడ్ అనే మోడల్ ఎంట్రీ ఇచ్చారు. పదకొండో కంటెస్టెంట్‌గా మిత్రా శర్మ, పన్నెండో కంటెస్టెంట్‌గా తేజస్వీ మదివాడ, పదమూడో కంటెస్టెంట్‌గా సరయూ రాయ్, పద్నాలుగో కంటెస్టెంట్‌గా యాంకర్ శివ, పదిహేనో కంటెస్టెంట్‌గా బిందు మాధవి, పదహారో కంటెస్టెంట్‌గా హమీదా ఎంట్రీ ఇచ్చారు.పదిహెడో కంటెస్టెంట్‌గా అఖిల్ ఎంట్రీ ఇచ్చాడు.
Bigg Boss OTT : 17 కంటెస్టెంట్స్ తో రచ్చ రంబోలా..
మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ షోలో తెగ సందడి చేయనున్నారు. వీరు 84 రోజుల పాటు పుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని నాన్‌స్టాప్‌గా అందించనున్నట్టు తెలుస్తుంది. కేవలం ఒక గంట కాకుండా.. ఈసారి 24 గంటలు వినోదాన్ని ప్రేక్షకులను చేరువచేసేందుకు బిగ్‌బాస్ ఓటీటీ అంటూ సరికొత్త ప్రయత్నం చేస్తుంది. ఇక ఎప్పటిలాగే.. బిగ్‌బాస్ ఓటీటీకి కూడా అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేయబోతున్నాడు. నెటిజన్స్ ఆలోచనలకు తగినట్టుగానే తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కంటెస్టెంట్స్‌ని సెలక్ట్ చేసింది.