Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ నాన్ స్టాప్ అఖిల్ నెక్ట్స్ నువ్వే.. తష్మాత్ జాగ్రత్త
Bigg Boss OTT Telugu : స్టార్ మా మా ఛానల్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో కి తెలుగు ప్రేక్షకులు విశేష ఆదరణ దక్కింది. భారీ ఖర్చుతో షో నిర్వహించిన నిర్వాహకులకు భారీ ఎత్తున లాభాలు వస్తున్న నేపథ్యంలో తాజాగా డిజిటల్ ప్లాట్ ఫారం పై ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు బిగ్బాస్ నాన్స్టాప్ షురూ చేశారు. నాగార్జున హోస్టింగ్ చేస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇప్పటి వరకు అమ్మాయిలు బిగ్బాస్ విజేతగా నిలిచింది లేదు. ఈసారి బిందు మాధవి ఆ ఘనత ను దక్కించుకుంటుంది అంటూ ప్రతి ఒక్కరూ నమ్మకంతో ఎదురు చూస్తున్నారు.
ఇలాంటి సమయంలో బిందు మాధవి కి పోటీగా అఖిల్ గట్టిగా నిలబడి ఉన్నాడు అని మొన్నటి వరకు భావించారు. కానీ అతడు గ్రూప్ గా ఆడుతూ ప్రతి ఒక్కటి కూడా అతడి యొక్క అతి తెలివిని ప్రదర్శిస్తూ గ్రూపు ని ఎంకరేజ్ చేస్తూ తన గెలుపుకు బాటలు వేసుకుంటున్నాడు. తద్వారా అఖిల్ అత్యంత విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది అఖిల్ తాజాగా అయిన అఖిల్ సోషల్ మీడియాలో విపరీతమైన ఎదుర్కోవలసి వచ్చింది. తన గ్రూపు సహాయం తో సహాయంతో అఖిల్ కెప్టెన్ అయ్యాడు అంటూ ప్రతి ఒక్కరూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. గ్రూప్గా ఆడను అంటూ గతంలో బిందు మాధవి తో చెప్పిన అఖిల్ ఇప్పుడు ఎలా గ్రూప్ గా ఆడి కెప్టెన్ అంటూ ప్రశ్నిస్తున్నారు.

Bigg Boss OTT Telugu bindu madhavi fans warning to akhil
అఖిల్ ఈ మధ్య కాలంలో కాస్త ఓవరాక్షన్ చేస్తున్నాడని అతడు తన ఓవరాక్షన్ తగ్గించుకోకుంటే ప్రేక్షకులు తగ్గిస్తారు అంటూ బిందు మాధవి అభిమానులు సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేస్తున్నారు. అతడి ప్రవర్తన ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా త్వరలోనే అతడు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు లేక పోలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావించిన తేజస్వి మడివాడ బయటికి వెళ్లడం చర్చనీయాంశం గా మారింది. ఆమె కచ్చితంగా ఫైనల్ పై లేదా టాప్ సిక్స్ కంటెస్టెంట్ అంటూ ప్రతి ఒక్కరూ బలంగా నమ్ముతారు. కానీ ఆమె బయటకు వెళ్ళిపోయింది. అదే తరహాలో అఖిల్ కూడా ఓవరాక్షన్ చేస్తే వెళ్ళిపోక తప్పదేమో అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.