Bigg Boss OTT Telugu : మళ్లీ పాత నటరాజ్ మాస్టర్ వచ్చేశాడు.. ఇక బయటకేనా?
Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి రెండు వారాల్లో నటరాజ్ మాస్టర్ గురించి రకరకాలుగా ప్రచారం జరిగింది. గత సీజన్లో మాదిరిగానే ఈ సీజన్లో కూడా ఆయన చాలా తక్కువ సమయంలోనే ఎలిమినేట్ అవుతాడు అంటూ ప్రతి ఒక్కరు భావించారు. కానీ అనూహ్యంగా ఆయన మూడవ వారం నుండి తన పద్ధతిని మార్చేసి పద్ధతి గా ఉంటూ వస్తున్నాడు. ఆయనకు హౌస్లో మద్దతు పెరగడంతో పాటు ప్రేక్షకులు కూడా మద్దతు పెరుగుతుంది అనుకుంటున్న సమయంలో ఆయన మళ్లీ పాత నటరాజ్ మాస్టర్ ని బయటకు తీశాడు.
ఈసారి మాస్టర్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మరో ఒకటి రెండు వారాల్లోనే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది. నటరాజ్ మాస్టారు తీరుని ఇంట్లో సభ్యులు మాత్రమే కాకుండా బయట ప్రేక్షకులు కూడా విమర్శిస్తున్నారు. తాజాగా ఎలిమినేషన్ కి నామినేషన్ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన పై ఉన్న కొద్ది పాటి గౌరవం కూడా తగ్గించే లా ఉన్నాయి అంటూ బిగ్బాస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మొన్నటి వరకు తేజూ కి అత్యంత సన్నిహితుడిగా ఆయన పేర్కొన్నాడు. కానీ ఇప్పుడు ఆమె తనకు పెట్టిన అన్నంలో విషం కలిపి ఇచ్చింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

Bigg Boss OTT Telugu nonstop trolls on Nataraj Master
ఆ వ్యాఖ్యలు అతని యొక్క మనస్తత్వాన్ని బయట పెట్టాయి అంటూ ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ అమ్మాయి మాట తీరు కటువుగా ఉన్నా కూడా కచ్చితంగా మాస్టర్ అంటే ఆమెకు గౌరవం.. తన తండ్రి స్థానాన్ని అతనికి ఇచ్చింది. అలా ఇచ్చిన వ్యక్తి ని ఇలా అన్నం లో విషం పెట్టి ఇచావు అంటూ మాట్లాడడం మాస్టర్ యొక్క స్వభావం అంటూ ప్రతి ఒక్కరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకే మాస్టారు మీరు త్వరలోనే బయటకు వచ్చేస్తారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.