Rathika Rose : బిగ్ బాస్ సీక్రెట్ లీక్.. విన్నర్ ఎవరో చెప్పేసిన రతిక? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rathika Rose : బిగ్ బాస్ సీక్రెట్ లీక్.. విన్నర్ ఎవరో చెప్పేసిన రతిక?

 Authored By kranthi | The Telugu News | Updated on :2 October 2023,9:00 pm

Rathika Rose : బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినప్పుడు, ఆ తర్వాత బయటికి వచ్చినప్పుడు బిగ్ బాస్ సీక్రెట్స్ ఏవీ ఎవ్వరికీ చెప్పకూడదు. ఏవైనా తెలిసినా కూడా మనసులోనే దాచుకోవాలి. బయటికి చెప్పకూడదు. కానీ.. బిగ్ బాస్ సీక్రెట్స్ మొత్తం రతిక రోస్ బయటికి వచ్చి చెప్పేసింది. రతిక నాలుగో వారమే హౌస్ నుంచి బయటికి వచ్చేసిన విషయం తెలిసిందే. కానీ.. తను నాలుగో వారమే ఎలిమినేట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. కానీ.. తను నామినేట్ అవ్వాల్సి వచ్చింది. కానీ.. తనకు తనను ఎలిమినేట్ చేయడం రతికకు నచ్చలేదు. అందుకే బయటికి వచ్చి రచ్చ రచ్చ చేస్తోంది. నిజానికి రతిక ఎలిమినేట్ అవుతున్న విషయం ఒక రోజు ముందే తెలిసిపోయింది. రతిక టాప్ 5 లో ఉండాల్సిన కంటెస్టెంట్. కానీ.. తను నాలుగో వారమే ఎలిమినేట్ అయింది.

అయితే.. ఎలిమినేట్ అయిన రతిక.. బయటికి వచ్చి కూడా సైలెంట్ గా ఉండకుండా రచ్చ రచ్చ చేసింది. పలు ఇంటర్వ్యూలు ఇచ్చిన రతిక బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పేసింది. బిగ్ బాస్ విన్నర్ ఎవరో ముందే డిసైడ్ అయిపోయిందట. ముందే వాళ్లు విన్నర్ ను డిసైడ్ చేసుకున్నారు. ఏదో గేమ్ ఆడుతున్నాం అంతే. అంతకుమించి ఇంకేం లేదు. ఆట మీద ఆసక్తి కూడా పోయింది. విన్నర్ కన్ఫమ్ అయ్యాక ఇంకేముంది. వాళ్లు విన్నర్, రన్నర్ ను కన్ఫమ్ చేసుకొని మిగితా వాళ్లను ఒక్కొక్కరిని వారానికి ఒక్కరు చొప్పున బయటికి పంపించేస్తున్నారని రతిక వాపోయింది. అందుకే తను ఎంత బాగా ఆడుతున్నా కూడా తనను ఎలిమినేట్ చేశారని చెప్పుకొచ్చింది.

bigg boss secret revealed by rathika rose

#image_title

Rathika Rose : ఇంతకీ బిగ్ బాస్ 7 విన్నర్ ఎవరు?

అయితే.. బిగ్ బాస్ 7 విన్నర్ ఎవరు అనేది రతిక చెప్పేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. తను చెప్పినట్టుగానే హౌస్ లో కూడా ఆ కంటెస్టెంట్ మీదనే అందరూ ఫోకస్ పెట్టారు. చివరకు నాగార్జున కూడా ఆ కంటెస్టెంట్ వైపే నిలబడుతున్నాడు. ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరు అంటారా? హౌస్ లోనే అందరికంటే పెద్ద అయిన శివాజీ. అవును.. శివాజీకే బిగ్ బాస్ 7 విన్నర్ ట్రోఫీ ఇవ్వాలని బిగ్ బాస్ యాజమాన్యం ఫిక్స్ అయిందట. వాళ్లు ముందే విన్నర్ ను ఫిక్స్ అయిపోయారని.. ఆయన శివాజీనే అని.. అందుకే మాటీవీ కూడా శివాజీని మంచిగా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తోందని రతిక సంచలన కామెంట్లు చేసింది. తన కామెంట్లపై బిగ్ బాస్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే మరి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది