shanmukh : సిరితో ఆ విషయంలో ఓపెన్ అయిన షన్ను.. వీరిద్దరి మధ్య ఉంది లవ్వేనా..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 9, 2021, 10:00 pm

shanmukh : బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 5 లో గేమ్‌ ఇక కేవలం ఒక్క వారామే మిగిలి ఉంది. ఈ వారం సిరి పక్కా ఎలిమినేట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. ఆమె ఇప్పటిదాకా ఉండటమే ఎక్కువ అని అంటున్నారు. సిరి, షన్ను లా ట్రాక్ జనాలకు విసుగు తెప్పిస్తోంది. ఓసారి మంచి ఫ్రెండ్స్ అంటూ… మరోసారి ప్రెండ్స్ కంటే ఎక్కువే మేము అనేలా చూపిస్తూ హౌస్ లో గందర గోళం సృష్టిస్తున్నారు వీరిద్దరూ. బుధవారం టాస్క్ పూర్తయిన అనంతరం షన్ను తనకు సిరి మీదున్న ప్రేమను బయట పెట్టేశాడు. సిరి… నువ్వు ఎలిమినేట్ అయితే ఎలానే.. అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

నువ్వు వెళ్లిపోతే నన్ను ఇక్కడ పట్టించుకునే వారే లేరు అంటూ వాపోయాడు. నువ్వు లేని హౌస్ లో నేను ఎలా ఉండగలను సిరి అంటూ… నాకు వారం రోజులు ఇక ఏడుపే దిక్కు అని ఏడుపును దిగమింగుకున్నాడు. అంతటితో ఆగక… సిరి నువ్ నాకు బాగా అలవాటు అయ్యావే అని అన్నాడు. ఇదంతా వింటూ వచ్చిన సిరి…. మరి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఎలారా? అని అంటుంది. అవును మనం బయటకు వెళ్లాక ఇంత క్లోజ్‌గా ఉండం కదా? అంటూ షన్ను నవ్వేశాడు. అయితే తాను ఎలిమినేట్ కానన్న భరోసా తనకు ఉందని సిరి ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పేసింది.

Bigg boss 5 Telugu  siri hanumanth and shanmukh jashwanth relationship going viral in social media

Bigg boss 5 Telugu  siri hanumanth and shanmukh jashwanth relationship going viral in social media

shanmukh : హాగ్గులు, కిస్సులతో ట్రోలింగ్ కు గురవుతున్న సిరి, షన్ను:

ఒక పెయిర్ గా ఇద్దరి మధ్య లవ్ కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అవుతున్నా… అదంతా నాటకమా లేక నిజమా అని జనాలు జుట్టు పీక్కుంటున్నారు. సిరికి బయట ఆల్ రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పటికీ… షన్నుకు లవర్ ఉన్నప్పటికీ వీళ్ళు ఇలా చేస్తుండటం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఓట్ల కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ… కాకపోతే గెలుపు కోసం హగ్గులు, కిస్సులతో మరి ఇంతలా రెచ్చి పోతారా అంటూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఇలా వీరిద్దరూ బిగ్ బాస్ అన్ని సీజన్లలో.. మోస్ట్ ఇరిటేటింగ్ కపుల్ గా నిలుస్తున్నారు..

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp