Bigg Boss Telugu 7 : శివాజీని ఇంటికి పంపిస్తున్న బిగ్ బాస్.. వెక్కి వెక్కి ఏడుస్తున్న కంటెస్టెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss Telugu 7 : శివాజీని ఇంటికి పంపిస్తున్న బిగ్ బాస్.. వెక్కి వెక్కి ఏడుస్తున్న కంటెస్టెంట్స్

 Authored By kranthi | The Telugu News | Updated on :17 October 2023,1:00 pm

Bigg Boss Telugu 7 : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా బిగ్ బాస్ గురించే చర్చ. బిగ్ బాస్ సీజన్ 7 ఈసారి పేరుకు తగ్గట్టుగానే నిజంగానే ఉల్టా పుల్టా అన్నట్టుగానే ఉంది. బిగ్ బాస్ సీజన్ 7 అన్ని సీజన్ల కంటే బెస్ట్ అని రుజువు చేసుకుంది. ఈసారి వచ్చిన కంటెస్టెంట్లు కూడా హౌస్ లో బాగా ఆడుతున్నారు. హౌస్ లో కావాల్సినంత వినోదం, కావాల్సింత గొడవ, కావాల్సినన్ని గ్రూపులు అన్నీ ఉన్నాయి. చీమ చిటుక్కుమన్నా హౌస్ లో గొడవ స్టార్ట్ అవుతుంది. అది బిగ్ బాస్ హౌస్ స్పెషాలిటీ. ఇక బిగ్ బాస్ హౌస్ లో 14 మంది కంటెస్టెంట్లు ఉన్నా.. అందరి చూపు మాత్రం ఒక్క శివాజీ మీదనే ఉంటుంది. ఎందుకంటే ఆయన అందరికంటే సీనియర్, హౌస్ లో చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు. ఎవ్వరినీ నొప్పించకుండా.. తన గేమ్ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నాడు శివాజీ.

అయితే ఇటీవల జరిగిన ఓ టాస్క్ లో శివాజీ చేయికి దెబ్బతాకింది. దీంతో ఆయన గత కొన్ని రోజులుగా ఫిజికల్ టాస్కులు ఆడటం లేదు. కొన్ని రోజుల పాటు హౌస్ లో ఏ పని చేయకుండా కూర్చొని ఉన్నాడు శివాజీ. బిగ్ బాస్ కూడా శివాజీకి ట్రీట్ మెంట్ చేయించలేదు. కానీ.. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్.. శివాజీని బయటికి తీసుకెళ్తాడు. మీరు బయటికి రావాల్సి ఉంటుంది. మీకు స్కానింగ్ తీస్తాం అని చెబుతాడు బిగ్ బాస్. ఇంటి సభ్యులకు అందరికీ చెప్పి రావాలని చెబుతాడు బిగ్ బాస్. దీంతో ఇంట్లోని వాళ్లందరికీ చెప్పి శివాజీ మెయిన్ డోర్ ద్వారా బయటికి వెళ్లిపోతాడు. నిజానికి చేయి ఒక్కటే కాదు.. శివాజీకి వేరే అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయట. వాటికి ట్రీట్ మెంట్ చేయించుకోవడానికే ఆసుపత్రికి వెళ్లినట్టు తెలుస్తోంది. అలాగే.. తనకు గాయమైన చేయి స్కానింగ్ కూడా చేయించుకున్నట్టు తెలుస్తోంది.

bigg boss telugu 7 contestant shivaji out of the house

Bigg Boss Telugu 7 : స్కానింగ్ రిపోర్టులు చూసి డాక్టర్లు షాక్

అయితే.. శివాజీ ఇచ్చిన బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత డాక్టర్లు షాక్ అయినట్టు తెలుస్తోంది. స్కానింగ్ రిపోర్టులు, బ్లడ్ టెస్ట్ రిపోర్టులు వచ్చాక డాక్టర్లు షాక్ అయినట్టు తెలుస్తోంది. ఆయనకు చేయినొప్పితో పాటు నడుంనొప్పి, వేరే అనారోగ్య సమస్య ఉన్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలో మళ్లీ శివాజీని ఎలిమినేట్ చేసి పంపిస్తారా? లేక.. శివాజీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది