Bimbisra vs Sita Ramam Collections : బింబిసార వర్సెస్‌ సీతారామం… మొదటి రోజు బాక్సాఫీస్ ఆధిపత్యం ఎవరిది?

Authored By aruna | The Telugu News | Published on: August 6, 2022, 3:20 pm

Bimbisra vs Sita Ramam Collections : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కు పాజిటివ్ రెస్పాన్స్ దక్కిన నేపథ్యంలో ఏకంగా మొదటి రోజే 11 కోట్ల 50 లక్షల రూపాయల వసూళ్లు నమోదు అయ్యాయి. అందులో షేర్‌ రూ. 7.27 కోట్లు గా సమాచారం అందుతోంది. నందమూరి కళ్యాణ్రామ్ కెరియర్ ప్రారంభించి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ప్రతి సినిమా మొదటి రోజు 2 లేదా 3 కోట్లు వసూలు చేయడం ఎక్కువ. కానీ ఈ సారి ఏకంగా పది కోట్ల కు మించి వసూలు చేయడంతో బింబిసార స్థాయి ఏంటో దీంతో అర్థమవుతోంది.

నందమూరి కళ్యాణ్ రామ్ తో పాటు నిన్న ప్రేక్షకుల ముందుకు దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమాకు సంబంధించిన వస్తువులు తీవ్ర నిరాశ కలిగించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఆ సినిమా కూడా చాలా పాజిటివ్ గానే వస్తువులను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా ఆరు కోట్ల వసూళ్ల ను రాబట్టినట్లు గా సమాచారం అందుతోంది. సినిమాకు మొత్తంగా రూ. 17 కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం. మొదటి రోజే మూడు కోట్ల కు పైగా షేర్‌ రావడంతో బ్రేక్ ఈవెన్ సాధ్యమే అంటూ అంతా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

bimbisra vs sita ramam collections movies collections in first day

bimbisra vs sita ramam collections movies collections in first day

నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా బ్రేక్ ఈవెన్‌ ను మించి భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద పోటీ పడటంతో వసూళ్ల విషయంలో ప్రభావం ఉంటుందని అంతా భావించారు. అయినా కూడా రెండు సినిమాలకు మంచి వసూళ్లు నమోదయ్యాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ కళ కళలాడుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp