HBD Rashmika Mandanna : ర‌ష్మీక మంద‌న్నా బ‌ర్త్‌డే స్పెష‌ల్.. పుష్ప 2 నుంచి శ్రీ‌వ‌ల్లి సీరియ‌స్ లుక్ రిలీజ్‌…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

HBD Rashmika Mandanna : ర‌ష్మీక మంద‌న్నా బ‌ర్త్‌డే స్పెష‌ల్.. పుష్ప 2 నుంచి శ్రీ‌వ‌ల్లి సీరియ‌స్ లుక్ రిలీజ్‌…!

HBD Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన Rashmika Mandanna గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమా తో రష్మిక మందన పాన్ ఇండియా లెవెల్లో పరిచయమయ్యారు. దీంతో కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పలు రకాల ఇండస్ట్రీలలో ఆమె సత్తా చాటుతూ దూసుకుపోతున్నారు. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో రెయిన్బో అనే లేడీ ఓరియంటెడ్ మూవీ తో పాటుు ఐకాన్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :5 April 2024,12:35 pm

ప్రధానాంశాలు:

  •  HBD Rashmika Mandanna : ర‌ష్మీక మంద‌న్నా బ‌ర్త్‌డే స్పెష‌ల్.. పుష్ప 2 నుంచి శ్రీ‌వ‌ల్లి సీరియ‌స్ లుక్ రిలీజ్‌...!

  •  Happy Birthday Rashmika Mandanna

HBD Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన Rashmika Mandanna గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమా తో రష్మిక మందన పాన్ ఇండియా లెవెల్లో పరిచయమయ్యారు. దీంతో కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పలు రకాల ఇండస్ట్రీలలో ఆమె సత్తా చాటుతూ దూసుకుపోతున్నారు. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో రెయిన్బో అనే లేడీ ఓరియంటెడ్ మూవీ తో పాటుు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప ది రూల్స్ సినిమాలో కూడా నటిస్తోంది.కాగా ఈరోజు ఈ ముద్దుగుమ్మ 27వ పుట్టినరోజు సందర్భంగా పుష్ప సినిమా నుండి ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మూవీ టీమ్ ఇటీవల విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ భామకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తెగ వైరల్ అవుతుంది. ఒక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసినట్లయితే ఒంటినిండా నగలు, పెద్ద బొట్టు, పట్టుచీర , జాకెట్ లో కనిపించి రష్మిక అందర్నీ ఆకట్టుకుంటుంది. అయితే మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగంలో రష్మిక పాత్ర కాస్త తగ్గిందని పలువురు అంటున్నారు. అయితే భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతున్న ఈ సినిమాకు లెక్కలు మాస్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

HBD Rashmika Mandanna 38 మిలియన్ల ఫాలోవర్స్ రికార్డ్ సృష్టించింది

అయితే రష్మిక మందన ఇప్పటికే హిందీలో యానిమల్ అనే సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు సాధించింది. రన్బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు. భారీ అంచనా నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులను సృష్టించింది. ఈ విధంగా వరుస విజయాలతో పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న ఈ కన్నడ ముద్దుగుమ్మ తాజాగా ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో కూడా చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలోనే 2024 డిస్ట్ర ప్టర్స్, ట్రైల్ బ్లేజర్స్ కేటగిరిలో రష్మిక చోటు దక్కించుకున్నట్లుగా ఫోర్బ్స్ ఇండియా ప్రకటించడం జరిగింది. దీంతో ప్రస్తుతం రష్మిక ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు .

HBD Rashmika Mandanna ర‌ష్మీక మంద‌న్నా బ‌ర్త్‌డే స్పెష‌ల్ పుష్ప 2 నుంచి శ్రీ‌వ‌ల్లి సీరియ‌స్ లుక్ రిలీజ్‌

HBD Rashmika Mandanna : ర‌ష్మీక మంద‌న్నా బ‌ర్త్‌డే స్పెష‌ల్.. పుష్ప 2 నుంచి శ్రీ‌వ‌ల్లి సీరియ‌స్ లుక్ రిలీజ్‌…!

ఈ నేపథ్యంలోనే రష్మిక మరో సంచల రికార్డును కూడా క్రియేట్ చేశారు. ఇంస్టాగ్రామ్ లో తరచూ తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ సందడి చేసే రష్మిక తాజాగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో మొత్తం 38 మిలియన్ల ఫాలోవర్స్ ను దక్కించుకుని రికార్డ్ సృష్టించింది. దీంతో ప్రస్తుతం భారతదేశంలోనే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్స్ లో రష్మిక ఒకరుగా నిలిచారు. ఈ విధంగా వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న రష్మిక మందన రెమ్యూరేషన్ కూడా ఆ స్థాయిలోనే తీసుకుంటుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె ఒక్కో సినిమాకు దాదాపు 4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక రష్మిక ఆస్తుల విషయానికొస్తే దాదాపు 64 కోట్లు ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి. ఇక ఆమె నెలవారి ఆదాయం 60 లక్షలకు పైగా వార్షికోదాయం 8 కోట్లకు పైగా ఉంటుందని సెలబ్రిటీల ఆస్తు వివరాలను తెలియజేసే వెబ్ సైట్ తాజాగా విడుదల చేసింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది