Rashmika Mandanna : బాబోయ్.. రష్మిక రచ్చని తట్టుకోవడం కష్టమే.. మరీ ఇంత గ్లామర్ షోనా?
Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఇప్పుడు తెలుగు, హిందీ భాషలలో మాములు హవా చూపించడం లేదు యానిమల్, పుష్ప 2, ఛావా లాంటి సినిమాల్లో అటు పర్ఫార్మెన్స్.. ఇటు రొమాంటిక్ క్యారెక్టర్స్ చేస్తూ వరస విజయాలు అందుకున్నారు రష్మిక మందన్న. ఈ మూడు సినిమాలతో అమ్మడు బాక్సాఫీస్ క్వీన్ అయిపోయారు.ఈమె అడుగు పెట్టిన సినిమా బ్లాక్‌బస్టర్ అని ఫిక్సైపోయారు మేకర్స్ కూడా. ఇలాంటి సమయంలో విడుదలైన సికిందర్ అంచనాలన్నీ తారుమారు చేసింది.
Rashmika Mandanna : క్రేజీ గార్ల్..
సల్మాన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన సికిందర్ సినిమా మొదటి రోజు నుంచే డల్‌గా మొదలైంది.ఓపెనింగ్స్ కూడా ఏమంత గొప్పగా రాలేదు.. ఫైనల్ రన్ కూడా అతికష్టం మీద 100 కోట్లు నెట్ దాటింది. ఇక రష్మిక పాత్ర విషయానికి వస్తే.. అరగంటకు అటూ ఇటూగా ఉండే పాత్రతో సరిపెట్టేసారు మురుగదాస్. లేదనకుండా 2 పాటల్లో కనిపించారు ఈ బ్యూటీ. ఈ సినిమా ఫ్లాప్‌తో కాస్త నీరసించింది రష్మిక.

#image_title
ఇక రీసెంట్‌గా జీ సినిమా అవార్డ్స్ ఈవెంట్‌కి హాజరైంది రష్మిక. బ్లాక్ డ్రెస్‌లో బోల్డ్‌గా కనిపిస్తూ అక్కడ ఉన్నవారితో సందడి చేసింది. ఫోటోగ్రాఫర్స్‌తో ఫొటోలకి పోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో రష్మిక ఈ రేంజ్‌లో గ్లామర్ షో చేయలేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మికకి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Rashmika mandanna 🔥🔥 pic.twitter.com/3ZHZK9WyF7
— Tollywood news (@harika_reddy2) May 18, 2025