Bithiri Sathi : చేవెళ్ల రవి… ఈ పేరుతో కంటే బిత్తిరి సత్తి అంటేనే అందరికీ అతడు గుర్తు. ఒక సామాన్య నిరుపేద కుటుంబంలో జన్మించిన కావలి రవికుమార్ అలియాస్ చేవెళ్ల రవి ఇప్పుడు బిత్తిరి సత్తిగా తెలుగు సినిమా పరిశ్రమలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఒక విధమైన స్లాంగ్ తో, ఒక విధమైన భాషతో బిత్తిరి సత్తి మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఇంటర్వ్యూ చేసి.. సర్కారు వారి పాట కోసం మహేష్ బాబు ఇంటర్వ్యూ చేసిన బిత్తిరి సత్తి ని ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ఒకప్పుడు 1000 నుండి 2000 రూపాయల కోసం ఎంతో కష్టపడ్డ బిత్తిరి సత్తి ఇప్పుడు ఏకంగా 60 నుండి 70 లక్షల కారు కొనుగోలు చేయడం అతని సక్సెస్ ని కనులకు కట్టినట్లుగా చూపిస్తుంది.
బిత్తిరి సత్తి గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. నరసింహ, యాదమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పామెన గ్రామంలో 1979 ఏప్రిల్ 5వ తారీఖున జన్మించాడు. పాఠశాల వద్ద విద్య మొత్తం సొంత గ్రామంలోని చేశాడు. కాలేజీ కోసం చేవెళ్లకు వెళ్లాడు. చిన్నప్పటి నుండి సినిమాలపై ఆసక్తి ఉండడంతో 2003 వ సంవత్సరంలో సినిమా ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. పలువురు దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన బిత్తిరి సత్తి ఆ తర్వాత 2012లో జీ తెలుగులో ప్రసారమైన కామెడీ క్లబ్ అనే కార్యక్రమం ద్వారా బుల్లి తెర ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే సమయంలో జర్నలిజం కోర్స్ చేసి వి6 ఛానల్ లో కెరియర్ మొదలు పెట్టాడు. వి6 ఛానల్ లో తీన్మార్ న్యూస్ తో సావిత్రితో జతకట్టి సక్సెస్ అయ్యాడు.
ఇద్దరి కాంబోలో వచ్చిన ఎన్నో ఎపిసోడ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అందుకే బిత్తిరి సత్తికి ఏకంగా ఫిలిం స్టార్ రేంజ్ లో గుర్తింపు దక్కింది. అందుకే ఇప్పుడు ఫిల్మ్ స్టార్స్ కూడా ఆయనని చూసి ముక్కును వేలేసుకునే విధంగా ఇలా ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. ఓపికతో కష్టపడితే కచ్చితంగా ఏదో ఒక సమయంలో సక్సెస్ అవ్వచ్చు అనేందుకు బిత్తిరి సత్తి ప్రత్యక్ష నిదర్శనం, ఉదాహరణ. లక్షలాది మంది ఇండస్ట్రీలో అడుగు పెట్టి వెనుతిరిగి పోతున్నారు. ఇలాంటి సమయంలో వారికి చేవెళ్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి ఆదర్శమనడంలో సందేహం లేదు. ఇలా మరిన్ని సక్సెస్ లను బిత్తిరి సత్తి దక్కించుకోవాలని కోరుకుందాం. బిత్తిరి సత్తికి సినిమా డైరెక్షన్ చేయాలని కోరిక ఉంది త్వరలోనే అది తీరుతుందేమో చూడాలి. హీరోగా తుపాకి రాముడు అనే సినిమాతో వెండితెరపై సందడి చేసిన బిత్తిరి సత్తి కోతలు రాయుడు త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.